బిజినెస్

పకడ్బందీగా కాట్పా చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (కాట్పా) చట్టాన్ని పకడ్బందిగా అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. చట్టంలో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగ నిషేధం వంటి అంశాలను ఖచ్చితంగా అమలు చేసేందుకు అవసరమైతే కొత్తగా సిబ్బందిని నియమించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ పేరిట విడుదలైన ఒక ప్రకటనలో తెలిపింది. కాట్పా చట్టాన్ని అతిక్రమించిన వారి నుంచి జరిమానాలు వసూలు చేయడానికి కానిస్టేబుల్స్, మున్సిపల్ అధికారులను నియమించాలని కోరింది. పొగాకు వినియోగం కారంలో దేశంలో మృతి చెందుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నదని తెలిపింది. తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 13 లక్షలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది.
అందుకుగాను కాట్పా చట్టాన్ని కఠినతరంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ చట్టంలో ఉత్పత్తుల నియంత్రణ, వినియోగంపై అంకుశం వంటి ఎన్నో అంశాలున్నాయని వివరించింది. సరైన రీతిలో చట్టాన్ని అమలు చేస్తే, పొగాకు వినియోగంతో మృతి చెందుతున్న వారి సంఖ్యను తగ్గించవచ్చని తెలిపింది.