బిజినెస్

నిరంతరంగా 895 రోజులు అణువిద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి: ‘ప్రెషరైజ్డ్ హేవీ వాటర్ రియాక్టర్’ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, నిరంతరంగా 895రోజుల పాటు అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది ‘కైగాయూనిట్-1’ అణు విద్యుత్ కేంద్రం. భారతదేశ స్వదేశి సాంకేతిక పరిజ్ఞానంతో ‘కైగాయూనిట్-1’ అణు విద్యుత్ కేంద్రంలో ‘పిహెచ్‌డబ్ల్యుఆర్’ ద్వారా నిరంతర అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ప్రపంచ రికార్డును సాధించినట్లు ‘కైగా’ అణువిద్యుత్ కేంద్రం డైరెక్టర్ సంజయ్‌కుమార్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటోమిక్ ఎనర్జి ప్రచార ప్రతినిధి రవీశంకర్ వివరించారు. వారు శనివారం ఆంధ్రభూమితో మాట్లాడుతూ, 220మెగావాట్స్ విద్యుత్ తయారు సామార్థ్యంతో ఈ అణువిద్యుత్ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. ఈ అణువిద్యుత్ కేంద్రం ప్రపంచలోనే ఎక్కువ రోజులు నిరంతరంగా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసిన అణువిద్యుత్ కేంద్రంగా ‘కైగా’కు ఈనెల 25వ తేది ప్రపంచ గుర్తింపు లభించిందని వారు వెల్లడించారు. 2000సంవత్సరంలో కర్నాటక రాష్ట్రంలోని ఉత్తరకన్నడ జిల్లాలోని కార్వార్‌కు సమీపంలోని పెద్ద అటవి ప్రాంతంలో ‘కైగా’ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు అయినప్పటికీ, ఈ అణువిద్యుత్ కేంద్రంలో ‘ప్రెసరైజ్డ్ హేవివాటర్ రియాక్ట్‌ర్’(పిహెచ్‌డబ్ల్యుఆర్)ను కేవలం స్వదేవి పరిజ్ఞానంతో 13మే 2016ను పూర్తి హంగులతో అన్ని సమస్యలు, ఇబ్బందులు అధిగమించి ప్రారంభించి సక్సెస్ సాధించినట్లు వివరించారు.
2016 నుండి ‘కైగా’ అణు విద్యుత్ కేంద్రంలో 13మే 2016నుండి, 25-10-2018వరకు 895రోజుల పాటు నిరంతరంగా అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుందని వెల్లడించారు. కైగా అణువిద్యుత్ కేంద్రంలో ‘పిహెచ్‌డబ్ల్యుఆర్’ ద్వారా అణువిద్యుత్ ఉత్పత్తి జరుగుతూ, శనివారం నాటికి 897రోజులకు చేరిందని వివరించారు. ప్రతి రోజు ఈ పిహెచ్‌డబ్ల్యుఆర్ ద్వారా 5.2మిలియన్‌ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వివరించారు. ఇక్కడ ఉత్పత్తి అయిన అణువిద్యుత్‌ను తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో అణువిద్యుత్ కేంద్రంలో అణు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఇది భారతదేశం గర్వించదగ్గ విషయం కావడం గమనార్హం.

చిత్రం..ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న ‘కైగాయూనిట్-1’ అణువిద్యుత్ కేంద్రం