బిజినెస్

తగ్గిన ఇంధన వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశం వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇంధన వినియోగంలో తగ్గుదల నమోదవుతున్నది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే, కొంత పెరిగినప్పటికీ, ఈ ఏడాది మార్చి తర్వాతి గణాంకాలను గమనిస్తే వినియోగం తగ్గిందని స్పష్టమవుతున్నది. గత ఏడాది ఆగస్టులో 16,478 వేల మెట్రిక్ టన్నుల ఇంధన వినియోగం జరిగింది. ఆతర్వాత క్రమంగా పెరుగుతూ ఈ ఏడాది మార్చిలో 18,617 వేల మెట్రిక్ టన్నులకు చేరింది. అయితే, మార్చి తర్వాత తగ్గుదలను గణాంకాల్లో చూడవచ్చు. ఏఫ్రిల్‌లో 17,667 వేల మెట్రిక్ టన్నుల వినియోగం నమోదైంది. కానీ, మేలో తిరిగి పెరిగి, 18,717 వేల మెట్రిక్ టన్నులకు చేరింది. ముడి చమురు ధర పెరుగుదల కారణంగా పెట్రో ధరలకు రెక్కలు రావడంతో ఇంధన వినియోగంలో తగ్గుదల కనిపించింది. జూన్‌లో 17,057 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న ఇంధన వినియోగం జూలైలో 17,994 వేల మెట్రిక్ టన్నులకు చేరింది. ఆగస్టులో గణనీయంగా తగ్గింది. 16,603 మెట్రిక్ టన్నుల వినియోగం ఈ ఏడాది ఇప్పటి వరకూ అతి తక్కువగా పేర్కోవాలి. ఇంధన ధరలు పెరగడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల లభ్యత వంటి అంశాలు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.