బిజినెస్

ఆకర్షణీయంగా గ్లోబల్ ఈటీఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: గ్లోబల్ ఎక్ఛ్సేంజ్ ట్రేడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను మరింత ఆకర్షణీయంగా తయారు చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకోవడం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తున్నది. విదేశాల్లోని పెన్షన్ హౌస్‌ల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే, ప్రయోగాత్మకంగా ఈటీఎఫ్‌ను కేంద్ర ప్రవేశపెడుతుందని ఓ అధికారి పీటీఐతో మాట్లాడుతూ చెప్పారు. భారీ పెట్టుబడిదారులు ఎంత వరకూ మద్దతునిస్తారనే విషయంపై జరుగుతున్న అధ్యయనం పూర్తయిన తర్వాత ఈటీఎఫ్ మార్గదర్శకాలను రూపొందించనున్నట్టు తెలిపారు. కాగా, భారత్-22 అనే పేరును ఈటీఎఫ్ ప్రాజెక్టుకు కేంద్రం ప్రాథమికంగా ఖరారు చేసింది. ద్రవ్య మారక సమయంలో జరుగుతున్న జాప్యం, విపరీతమైన ఖర్చులు పలువురు పెట్టుబడిదారులను వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. కేంద్రం నిర్వహిస్తున్న అధ్యయనంలో ఈ విషయం తెలుగులోకి వచ్చింది. పెన్షన్ సొమ్మును పెట్టుబడుల రూపంలో మార్చాలంటే, ఇలాంటి ఖర్చులు ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఈటీఎఫ్ నిబంధనలను కేంద్రం సరళీకృతం చేసే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ (సీపీఎస్‌ఈ)ల నుంచి సొమ్మును కూడా ఈటీఎఫ్‌లోకి మార్చాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ కారణంగానే భారత్-22 ఈటీఎఫ్‌తోపాటే సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తున్నది. ఇలావుంటే, మ్యూచువల్ ఫండ్స్ విధానాల్లోనే ఈటీఎఫ్ కూడా లావాదేవీలను నిర్వహిస్తుంది. భారీ పెట్టుబడులను తీసుకొని, తిరిగి వివిధ రంగాల్లో ఆ మొత్తాలను తన వంతు వాటాలుగా ఉంచుకుతుంది. భారత్-22 ఈటీఎఫ్ కోసం రెండు ఫ్రాంచైజీల నంచి 22,900 కోట్ల రూపాయలను, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ కోసం మూడు ఫ్రాంచైజీల నుంచి 11,500 కోట్ల రూపాయలు చొప్పున నిధులను సిద్ధం చేసింది. దీనితోపాటు విదేశాల్లో పెన్షన్ పథకాల్లోని సొమ్మును పెట్టుబడులుగా తీసుకోవాలని కేంద్ర నిర్ణయించింది. సరికొత్త విధానంలో మార్కెట్‌లోకి రానున్న ఈటీఎఫ్ విదేశీ పెట్టుబడి సంస్థలను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.