బిజినెస్

దెబ్బ తీసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 28: దేశంలోని పది ప్రముఖ కంపెనీ సంస్ధల్లో ఎనిమిది సంస్థలు మార్కెట్ పతనంతో రూ.1,35,162.15 కోట్లను కోల్పోనట్లు స్టాక్ మార్కెట్ అంచనావేసింది. గత వారంలో మార్కెట్ పతనంతో దాదాపు 3 శాతం సంపద ఆవిరైంది. టీసీఎ, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్‌లు దెబ్బతిన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ గుడ్డిలోమెల్లిగా కొన్ని లాభాలను దండుకున్నాయి. టాటా కనె్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) ఎం క్యాప్‌లో రూ. 44,071.8 కోట్లను కోల్పోయింది. ఆర్‌ఐఎల్ సంస్థ రూ. రూ.36,097.6 కోట్ల నుంచి రూ.6,62,180.42 కోట్లకు, ఇన్ఫోసిస్ రూ.21,447.9 కోట్ల నుంచి రూ. 2,76,737.95 కోట్లకు , ఐటీసీ రూ. 9,549.33 కోట్ల నుంచి రూ. 3,43,592.12 కోట్లకు, ఎస్‌బీఐ రూ. 11,378.9కోట్ల నుంచి రూ. 2,21,419.02 కోట్లకు విలువ పడిపోయింది. గత వారంలో బీఎస్‌ఈ 30 షేర్ కీ సూచిక 966.32 పాయింట్లు పడిపోయింది. ఐసీఐసీఐ బ్యాంకు గత వారం మొదటి పది ర్యాంకుల్లో స్థానం సంపాదనించింది. టీసీఎస్ మొదటి స్తాదనంలో ఆ తర్వాత వరుస ర్యాంకుల్లో ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. కోటక్ మహీంద్రా విలువ రూ. 7,709.87కోట్ల నుంచి రూ. 2,21,044.81 కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ తన ఖాతాలో అదనంగా రూ.6886.95 కోట్లు, ఐసీఐసీఐ ఖాతాలో అదనంగా రూ.117.47 కోట్లు చేరాయి.