బిజినెస్

ఈ ఏడాది చిన్న, మధ్యతరహా పరిశ్రమల సేకరణ లక్ష్యం రూ.1281కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్ ద్వారా రూ.1,281 కోట్ల నిధులను ప్రాథమిక వాటాల విక్రయం ద్వారా సేకరించాయి. గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ నెలల్లో ఈ కేటగిరీలో వాటాల విక్రయాల వల్ల వచ్చిన నిధులు రెండు రెట్లు పెరిగాయి. ఐపీవోల ద్వారా వచ్చిన నిధుల ద్వారా వాణిజ్య విస్తరణ చేయాలని కంపెనీలు నిర్ణయించాయి. వర్కింగ్ క్యాపిటల్, ఇతర అవసరాల నిమిత్తం ఈ నిధులను వెచ్చించనున్నాయి. ఐపీవోల కేటగిరీలో దాదాపు 74 కంపెనీలు లిస్టయ్యాయి. ఈ సంస్థలు ఆరు నెలల్లో రూ. 1281 కోట్లను సేకరించాయి. గత ఏడాది ఇదే రోజుల్లో 58 సంస్థలు ఐపీవో ద్వారా రూ.656 కోట్లను సేకరించాయి. ఈ కంపెనీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ద్వారా లిస్టయ్యాయి. మ్యానుఫ్యాక్చరింగ్, జౌళి, ఇంజనీరింగ్, వ్యవసాయం, కెమికల్స్, ఫుడ్ ప్రోసెసింగ్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, ఫైనాన్స్, ఇనె్వస్ట్‌మెంట్స్ రంగాలకు చెందిన కంపెనీలు ఈ పెట్టుబడలను మదుపు చేశాయి. ఆరేళ్ల క్రితం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్‌లోకి వచ్చాయి. 2012లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ఈ తరహా సంస్థలకు ప్లాట్‌ఫారంలను ప్రారంభించాయి. గత ఆరేళ్లలో 450 కంపెనీలు లిస్టయ్యాయి. దాదాపు రూ.5400 కోట్ల నిధులను సేకరించాయి.