బిజినెస్

మరింత పతనం తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: విదేశీ ఇనె్వస్టర్లు దాదాపు రూ. 35,600 కోట్ల లాభాలను తన్నుకుని పోయారు. రూపాయి మారకం విలువ తగ్గుతుందని, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని, విశ్వ విపణిలో పెచ్చుమీరుతున్న టారిఫ్ వార్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కుదేలవుతుందని గ్రహించి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులను పెట్టినట్లే పెట్టి లాభాలు వచ్చిన వెంటనే వెనక్కు తీసేసుకున్నారు. దీనితో రాబోయే వారంలోనూ మార్కెట్ పతనం తప్పదా? అన్న భయాందోళనలు రేకెత్తుతున్నాయ. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో విదేశీ ఇనె్వస్టర్లు రూ.7,400 కోట్లను పెట్టుబడుల రూపంలో స్టాక్‌మార్కెట్లో పెట్టారు. సెప్టెంబర్ నెలలో రూ.21 వేల కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 26వ తేదీ మధ్య రూ.24,186 కోట్ల మేర పెట్టుబడుల వాటాలను విక్రయించారు. జనవరి, మార్చి, జూలై, ఆగస్టు నెలల్లో తప్ప మిగతా నెలల్లో పెట్టుబడులను విదేశీ పోర్టు ఫోలియా ఇనె్వస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ మార్కెట్‌ల నుంచి దాదాపు రూ. 97వేల కోట్ల పెట్టుబడులను విదేశీ ఇనె్వస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఈ క్విటీ మార్కెట్ నుంచి రూ.37వేల కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ. 60 వేల కోట్లను విత్ డ్రా చేశారు. ఏవీవీ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసస్ ప్రతినిధి రాహుల్ మిశ్రా మాట్లాడుతూ భవిష్యత్తులో రూపాయి మరింత క్షీణించే అవకాశం, చమురు ధరలు పెరగడం తదితర కారణాల వల్ల ముందు చూపుతో విదేశీ ఇనె్వస్టర్లు పెట్టుబడులను వెనక్కు తీసుకున్నట్లు అంచనా. ఆర్ శ్రీశంకర్ అనే విశే్లషకుడు మాట్లాడుతూ మార్కెట్ పతనం కొనసాగుతుందన్నారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు నవంబర్ 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ ప్రధానమైంది. దీనికి తోడు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిణామాల వల్ల విదేశీ ఇనె్వస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు.