బిజినెస్

వజ్రాల ఎగుమతుల విలువ 2,365 మిలియన్ డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: వివిధ దేశాలకు ఎగుమతైన సానపట్టిన వజ్రాల విలువ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2,365.88 మిలియన్ డాలర్లు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే మాసానికి 2,651.73 మిలియన్ డాలర్ల విలువైన కటింగ్, పాలిషింగ్ చేసిన వజ్రాలు మన దేశం నుంచి ఎగుమతయ్యాయి. అయితే, తర్వాతి కాలంగా ఎగుమతుల విలువ గణనీయంగా పడిపోయింది. గత ఏడాది డిసెంబర్‌లో అత్యల్పంగా 1,592.30 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరిగాయి. కానీ, తర్వాత పుంజుకోవడంతో, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ మొత్తం 2,426.86 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఆతర్వాత ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడింది. మార్చిలో 2,025.80 మిలియన్ డాలర్లు, ఏప్రిల్‌లో 1,994.76 మిలియన్ డాలర్లుగా నమోదైన ఎగుమతులు మేలో 2,213.85 మిలియన్ డాలర్లకు చేరాయి. జూన్‌లో 2,083.35, జూలైలో 1,839.87 మిలియన్ డాలర్లుకాగా, ఆగస్టులో మళ్లీ పుంజుకొని 2,180.39 మిలియన్ డాలర్లకు చేరింది. సెప్టెంబర్‌లో మరింత బలపడింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగిసే సమయానికి మెరుగుపడిన వజ్రాల ఎగుమతి మరింత బలోపేతమై, చివరి త్రైమాసికాంతానికి 3,000 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరుతుందని మార్కెట్ నిపుణుల అంచనా.