బిజినెస్

ఐటిసి లాభం రూ. 2,385 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో క్రిందటిసారితో చూస్తే 10 శాతం వృద్ధి చెంది 2,384.67 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 2,166 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు ఈసారి 13,156.68 కోట్ల రూపాయలుగా, పోయినసారి 12,150.48 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు గురువారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఐటిసి తెలిపింది. సిగరెట్లతో కూడిన ఎఫ్‌ఎమ్‌సిజి వ్యాపారం విలువ అంతకుముందుతో పోల్చితే 7.11 శాతం పెరిగి 10,615.75 కోట్ల రూపాయలుగా ఉంది. ఎఫ్‌ఎమ్‌సిజియేతర ఆదాయం 9.53 శాతం వృద్ధితో 2,385.15 కోట్ల రూపాయలుగా నమోదైంది.