బిజినెస్

బలహీనపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 30: రూపాయి మంగళవారం బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు పతనమయి, 73.68 వద్ద ముగిసింది. భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న, ఇతర ప్రధాన ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే అమెరికన్ డాలర్ బలపడుతున్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీల వలెనే రూపాయి విలువ కూడా మంగళవారం పతనమయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్‌లో మంగళవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగువ స్థాయి 73.58 వద్ద ప్రారంభమయింది. తరువాత మరింత దిగజారుతూ ఇంట్రా-డేలో కనిష్ట స్థాయి 73.70 వద్దకు చేరింది. దిగుమతిదారుల నుంచి అమెరికన్ డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ ఇలా పతనమయింది. అయితే, తరువాత రూపాయి కొంత వరకు కోలుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 23 పైసల దిగువన 73.68 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర స్థాయిలో అమ్మకాలు చోటు చేసుకోవడంతో పాటు దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం వల్ల రూపాయి విలువ పతనమయిందని ఫోరెక్స్ డీలర్లు చెప్పారు. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ దాదాపు ఫ్లాట్‌గా 73.45 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు నిరాటంకంగా తరలిపోతుండటం ఫోరెక్స్ మార్కెట్‌లో సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని, అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గడం రూపాయి విలువ మరింత పతనం కాకుండా నివారించిందని డీలర్లు పేర్కొన్నారు.