బిజినెస్

రెండు వారాల్లో గాడిన పడుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, అక్టోబర్ 30: సంక్షోభంలో కూరుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్)ను గాడిన పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కృషి చేస్తున్నాయని ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీశ్ కుమార్ చెప్పారు. వీలయినంత త్వరగా ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ వ్యవస్థను కుదుటపడవేయడానికి కృషి జరుగుతోందని ఆయన చెప్పారు. రెండు వారాలలో ఈ వ్యవస్థలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఒక ప్రత్యేకమయిన సంస్థ అని, అది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్, నిర్మాణ రంగాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆయన అన్నారు. కాన్సుల్ జనరల్ సందీప్ చక్రవర్తి నేతృత్వంలో ఇండియన్ కాన్సులేట్ ఇక్కడ నిర్వహించిన తొమ్మిదో ‘న్యూ ఇండియా లెక్చర్’ ఇంటరాక్టివ్ సెషన్‌లో రజ్‌నీశ్ కుమార్ మాట్లాడుతూ భారత్‌లో వౌలిక సౌకర్యాల రంగం ప్రత్యేకించి బీఓటీ (బిల్డ్- ఆపరేట్- ట్రాన్స్‌ఫర్) మోడల్ అనేక సమస్యలకు కారణమవుతోందని, బ్యాంకులకు కూడా దీని వల్ల సమస్యలు ఎదరవుతున్నాయని అన్నారు.