బిజినెస్

టెక్ మహీంద్రా నికర లాభం 27 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో 27.2 శాతం వృద్ధితో రూ. 1,064.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017 జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో తాను రూ. 836.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు టెక్ మహీంద్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంటే గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 27.2 శాతం వృద్ధి చెందింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా 13.4 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 7,606.4 కోట్లు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 8,629.8 కోట్లకు పెరిగింది. ‘ఈ త్రైమాసికంలో సాధించిన నికర లాభం మాకు సంతృప్తినిచ్చింది. మేము దృష్టి కేంద్రీకరించిన డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కంపెనీ మంచి పనితీరును కనబరచడానికి తోడ్పడింది’ అని టెక్ మహీంద్రా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సీపీ గుర్నాని పేర్కొన్నారు.