బిజినెస్

డీలిస్టింగ్ జాబితాలో మరో తొమ్మిది కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: చాలాకాలంగా ట్రేడింగ్ జరగకుండా, స్తబ్దంగా ఉన్న కంపెనీలను డీలిస్ట్ చేస్తున్న బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) తాజాగా మరో తొమ్మిది కంపెనీలను ఈ జాబితాలో చేర్చింది. సోమవారం నుంచి వీటి షేర్లను ఆరు నెలల పాటు డీలిస్ట్ చేస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్ఛ్సేంజ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ కంపెనీల షేర్లను ఉపసంహరిస్తున్నామని, ఈ డీలిస్టింగ్ ఆరు నెలల పాటు అమల్లో ఉంటుందని వివరించింది. అనిల్ లిమిటెడ్, బ్రేక్స్ ఆటో (ఇండియా) లిమిటెడ్, ఇండస్ ఫిలా, ఐక్యూ ఇన్ఫోటెక్ , లోక్ హౌసింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్స్, మెట్రోపొలి ఓవర్‌సీస్, పితాంపూర్ స్టీల్స్, ప్రకాష్ సాల్వెంట్ ఎక్‌స్ట్రాక్షన్స్, సిబర్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ (ఇండియా) సంస్థల షేర్లు చాలాకాలంగా ట్రేడింగ్ కావడం లేదని, అందుకే, వీటిని తాత్కాలికంగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తున్నామని బీఎస్‌ఈ తన ప్రకటనలో పేర్కొంది. స్టాక్ మార్కెట్‌లో లావాదేవీల్లో పాల్గొనే వారి అవగాహన కోసం జాబితాను విడుదల చేసినట్టు తెలిపింది. ఇలావుంటే, ఈ కంపెనీలకు చెందిన పూర్తికాల డైరెక్టర్లు, ప్రమోటర్లు పది సంవత్సరాల వరకూ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి దూరంగా ఉండాల్సి వస్తుందని బీఎస్‌ఈ తెలిపింది. ఈ ఏడాది మే మాసంలో రెండు వందలకుపైగా కంపెనీలను డీలిస్ట్ చేసిన బీఎస్‌ఈ జూలైలో 222 కంపెనీలపై ఈ వేటు విధించింది. ఆగస్టులో 17 కంపెనీలను ఈ జాబితాలో ఉంచింది. తాజాగా తొమ్మిది కంపెనీలను డీలిస్ట్ చేసింది.