బిజినెస్

కొత్తగా 75లక్షల మంది ఐటీ చెల్లింపుదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారుల జాబితాలో కొత్తగా 75 లక్షల మంది ఫైళ్లు చేరినట్లు ఆ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. కేంద్ర పన్నుల శాఖ బోర్డు డైరెక్టరేట్ (సీబీడీటీ) ఆదేశానుసారం వచ్చే యేడాది మార్చి నెలతో ముగిసే 2018-19 ఆర్థిక సంవత్సరాంతానికి 1.25 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులను జాతీయ జాబితాలోకి చేర్చాలన్నది ఆదాయ పన్ను శాఖ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ మేరకు సీబీడీటీ ఆదా య పన్ను శాఖకు ఓ విధానాన్ని నిర్ధేశించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 75 లక్షల మంది కొత్త ఆదాయపన్ను చెల్లింపుదారుల ఫైళ్లను జాబితాలో చేర్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పన్ను చెల్లింపులకు సంబంధించిన అంశాల పరిశీలనకు వివిధ ఎన్ఫోర్స్‌మెంట్ పద్ధతులను అమలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇంకా కొన్ని నెలల కాలవ్యవధి మిగిలివున్నందున 1.25 కోట్ల పన్ను చెల్లింపుదారులను జాబితాలో చేర్చాలన్న లక్ష్యాన్ని అధిగమిస్తామన్న ధీమా ఆ అధికారుల్లో వ్యక్తమవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ కొత్తగా 1.06 కోట్ల పన్ను చెల్లింపుదారులను జాతీయ జాబితాలో చేర్చింది. పన్ను ఫైలింగ్ చేయనివారి కోసం ఈ యేడాది ఆరంభంలో కొత్త ఆదాయపన్ను ఫైలర్లను ఏర్పాటుచేసింది. ఈ పన్ను చెల్లింపు విధానం ద్వారా ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించే వ్యక్తులు ఇదే సందర్భంలో తమకు రావలసిన మినహాయింపులు కోరే వెసులుబాటును కల్పించారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసుకునే వ్యక్తుల ఆదాయం పూర్తిగా శాఖ ఆమోదయోగ్యతను కలిగివుంటుందని అధికారి వివరించారు. ప్రస్తుతం మనదేశం ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, సంఘటిత, అసంఘటిత రంగాల్లో దేశం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని ఈ క్రమంలో పన్ను విధానాన్ని మరోమారు విస్తరించేందుకు అవకాశాలున్నాయని ఆ అధికారి తెలిపారు. ఇందులో భాగంగా ఈ యే డాది వార్షిక లక్ష్యాలను వివరిస్తూ సీబీడీటీ ఆదాయ పన్ను శా ఖ విజన్ డాక్యుమెంట్ (సీఏపీ)ని విడుదల చేసింది. ఈ మేర కు ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశీర్‌లను కొత్తగా 11,48,489 ఫైళ్ల జాబితాలో చేర్చాలంటూ లక్ష్యంగా నిర్ధేశించడం జరిగింది. అలాగే పూనే ప్రాంతానికి 11,33,950 ఫైళ్లు, తమిళనాడు ప్రాంతానికి 11.36.645 కొత్త ఫైళ్లు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు 10,36,645 కొత్త ఫైళ్లు చేర్చాలని లక్ష్యం నిర్ధేశించారు. మొత్తం మీద ఐటీ చెల్లింపు దారుల సంఖ్య గణనీ యంగా పెరగడం అధికారులకు ఊరటనిస్తున్నది.