బిజినెస్

పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీతో.. ఆర్థిక వృద్ధికి బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 10: పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అనే రెండు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు భారత దేశ ఆర్థిక వృద్ధికి అడ్డంకిగా మారాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు. బర్క్‌లీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ భారత దేశంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే, ప్రస్తుతం నమోదవుతున్న ఏడు శాతం వృద్ధి రేటు ఏమాత్రం సరిపోదని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి రేటు పెరుగుతుండగా, నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా భారత్‌లో కుంటుపడిందని అన్నారు. ఈ రెండూ అనూహ్య పరిణామాలని, ఒక రకంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి షాకిచ్చాయని పేర్కొన్నారు.
సుమారు 25 సంవత్సరాలపాటు ఏటా ఏడు శాతం వృద్ధి రేటు అనేది ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అద్దం పడుతుందని రఘురామ్ అన్నారు. అయితే, పెరుగుతున్న అవసరాలను బట్టి చూస్తే ఏడు శాతం వృద్ధి రేటు సరిపోదని అన్నారు. ఉద్యోగాల కోసం ఏటా ఎంతో మంది లేబర్ మార్కెట్‌లోకి వస్తున్నారని, వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాబట్టి, ఏడు శాతం వృద్ధితో సంతృప్తి చెందడం సరికాదని, అంతకంటే గొప్ప రేటును సాధించాలని చెప్పారు. వాణిజ్య రంగంలో భారత్ తన విధానాలను మరింత సరళీకృతం చేసిందని అన్నారు. ఈ కారణంగా, ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో నడిస్తే, భారత్ కూడా వాటి వెన్నంటే ఉండడం ఆనవాయితీగా మారిందన్నారు. అయితే, గత ఏడాది గ్లోబల్ మార్కెట్ అభివృద్ధిని నమోదు చేసినప్పటికీ, భారత్‌లో మాత్రం వృద్ధి రేటు పతనమైందని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్లే భారత ఆర్థిక పురోగవృద్ధి కుంటుపడిందన్నారు. అభివృద్ధి పథంలో ముందుకెళుతున్న భారత్‌ను ఈ రెండు చర్యలు వెనక్కు నెట్టేస్తున్నాయని రఘురామ్ వ్యాఖ్యానించారు. సుమారు రెండేళ్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్న భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న సమయంలోనే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం అశనిపాతమైందని అన్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన గందరగోళం, జీఎస్‌టీ అమలులో తొలుత ఎదురైన అడ్డంకుల నుంచి క్రమంగా కోలుకుంటున్న భారత్‌ను ముడి చమురు ధర దారణంగా దెబ్బతీసిందన్నారు. పెట్రో ధర నియంత్రణ, రూపాయి మారకపు విలువ స్థిరీకరణ, అనుత్పాదక ఆస్తుల సమర్థ నిర్వాహణ వంటి చర్యలతో భారత్ మళ్లీ పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు.