బిజినెస్

ప్రైవేట్ సంస్థలకు 149 చిన్న బావులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఓఎన్‌జీసీకి చెందిన 149 చమురు, సహజవాయువుక్షేత్రాలను ప్రైవేట్, విదేశీ కంపెనీలకు విక్రయించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పెద్ద బావులపైననే దృష్టిని కేంద్రీకరించాలని కేంద్రం భావిస్తోంది. చిన్న చితకా బావుల పర్యవేక్షణ తలకు మించిన భారంగా మారుతోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో డైరెక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ 15 ఉత్పత్తి క్షేత్రాలను గుర్తించింది. వీటిల్లో 791.2 మిలియన్ల టన్నుల క్రూడాయిల్, 333.46 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు నిపాల8 ఉన్నాయి. వీటిని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే అభివృద్ధి చెందుతాయని కేంద్రం నిర్ణయించింది. డైరెక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ నిర్ణయాన్ని ఓఎన్‌జీసీ వ్యతిరేకించింది. 2022 నాటికి ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న సహజవాయువు, చమురులో పదిశాతం వరకు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఓఎన్‌జీసీ ఉత్పత్తిచేస్తున్న 90 శాతం చమురు 60 పెద్ద బావుల నుంచి వస్తోంది. 149 చిన్న బావుల నుంచి కేవలం ఐదు శాతం ఉత్పత్తి వస్తోంది. వీటిని నిర్వహించలేక ఓఎన్‌జీసీ సతమతమవుతోంది. ఇప్పుడు ఓఎన్‌జీసీ కేవలం పెద్ద బావులపైనే దృష్టిని పెట్టిందని. టెక్నాలజీని సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఓఎన్‌జీసీపైన ఉంటుంది. నీతి ఆయోగ్ సీఈవో ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి చిన్న బావుల పనితీరు, అప్పగింతపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇంతవరకు 34 చిన్న బావులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. రెండవ విడతలో 25 బావులను అప్పగించే బిడ్డింగ్‌లను ఆహ్వానించారు. ప్రైవేట్ రంగానికి అప్పగించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని, దీని వల్ల 2022 నాటికి నిర్దేశించిన లక్ష్యం చేరుకోగలమని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఓఎన్‌జీసీ తమకు ఈ బావుల్లో వాటా ఉండేటట్లుగా మార్గదర్శకాలు సవరించాలని కోరుతోంది.