బిజినెస్

స్టాక్ మార్కెట్ ఢమాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 12: ఈవారం మొదటి రోజునే స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. సుమారు 346 పాయింట్లు కోల్పోయింది. రూపాయి మారకపు విలువ మరింత పతనం కావడం, ముడి చమురు ధర పెరుగుదలతోపాటు భవిష్యత్తులో లభ్యతపై నెలకొన్న అనుమానాలు మార్కెట్‌ను కమ్మేశాయి. విదేశీ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించకపోవడం కొనసాగుతునే ఉంటే, దేశీయ పెట్టుబడిదారులు సైతం వెనుకంజ వేయడం స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీసింది. నష్టాల ఊబి నుంచి బయటపడి, కొత్తవారం ప్రారంభం నుంచి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని విశే్లషకులు అంచనా వేసినప్పటికీ, సోమవారం ట్రేడింగ్ నిరాశను మిగిల్చింది. మొత్తం మీద 345.56 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్ 34,812.99 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఈ పతనం 34,756.80 పాయింట్లుగా నమోదైంది. అయితే, చివరిలో కొద్దిగా కోలుకుంది. కాగా, 103 పాయింట్లు తగ్గడంతో నిఫ్టీకి 10,482.20 పాయింట్ల వద్ద తెరపడింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో వివిధ అంశాలు కీలక పాత్ర పోషించాయి. వాటిలో ముడి చమురును ప్రధానంగా పేర్కోవాలి. వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తిని తగ్గంచాలని నిర్ణయించినట్టు సౌదీ అరేబియా చేసిన ప్రకటన యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అరేబియా దేశాల నుంచే పెట్రో ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. సౌదీ ఇప్పుడు ఉత్పత్తిని తగ్గిస్తాననడం సహజంగానే ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ ప్రకటన స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోతున్నాయని వాపోతున్న సౌదీ అరేబియా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా భారత స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. దీనికితోడు రూపాయి మారకపు విలువ సోమవారం మరింత పతనం కావడం వల్ల యాంటీ సెంటిమెంట్లు బలమైన పాత్ర పోషించాయి. త్వరలోనే ముడి చమురు ధర మరింత పెంచేందుకు సౌదీ తదితర దేశాలు సన్నాహాలు ప్రారంభిస్తున్నాయన్న వార్త సైతం మార్కెట్‌లో లావాదేవీలు తగ్గడానికి కారణమైంది. సెప్టెంబర్ మాసం పారిశ్రామిక ఉత్పత్తుల సూచీ (ఐఐపీ)తోపాటు ఈనెల వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) వివరాలను అధ్యయనం చేసిన తర్వాత తగిన నిర్ణయాలు తీకోవాలన్న అభిప్రాయం పెట్టుబడిదారుల్లో కనిపించింది. వినియోగ వస్తు, సేవల ధరల సూచీ 3.6 శాతం వరకూ తగ్గబోతున్నదన్న సమాచారంతో ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా వస్తుసేవల వివరాలను పరిశీలించిన అనంతరం పెట్టుబడులపై ఒక స్పష్టతకు రావాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. స్థూలంగా చూస్తే, పెట్రో ఉత్పత్తులను తగ్గిస్తామని సౌదీ అరేబియా చేసిన ప్రకటన, రూపాయి మారకపు విలువ పతనం వంటి అంశాలు ప్రభావం చూపడంతో, స్టాక్ మార్కెట్ నీరసపడింది. అవంతి ఫీడ్స్ 11.25 శాతం, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 8.63, హిందుస్తాన్ పెట్రోలియం 6.23 శాతం, ఇండియన్ సిమెంట్స్ 6.13 శాతం, జెట్ ఎయిర్ వేస్ 5.96 శాతం చొప్పున నష్టపోయాయి. అదే విధంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర తదితర కంపెనీల వాటాలు 0.5 శాతం నుంచి 0.20 శాతం మధ్య నష్టాలను చవిచూశాయి. లాభపడిన కంపెనీల్లో వోక్ హార్ట్ (9.02 శాతం), బలరాంపూర్ చీనీమాల్స్ (7.90 శాతం), టైటాన్ (5.28 శాతం), క్వాలిటీ (4.92 శాతం), వరుణ్ బెవరేజెస్ (4.39 శాతం) ఉన్నాయి.
సెస్సెక్స్‌తోపాటు నిఫ్టీ కూడా నష్టాలను చవిచూసింది. అత్యధికంగా 10,645.50 పాయింట్లు, అత్యల్పంగా 10,464.05 పాయింట్లు మధ్య ట్రేడింగ్ జరిగింది. చివరికి 10,482.20 పాయింట్ల వద్ద ముగిసింది.