బిజినెస్

లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌పై సెబీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: ద్రవ్య లభ్యతతో కూడిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కఠినతర నిబంధనలు అమలు చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ భావిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) డీఫాల్ట్ అయిన క్రమంలో సెబీ ప్రత్యేకంగా ఈ నిబంధనలు వర్తింపచేసేందుకు నడుంబిగించింది. సెబీ నియమించిన మ్యూచువల్ ఫండ్స్ సలహా కమిటీ సమావేశంలో(సోమవారం జరుగుతోంది) ఇందుకు సంబంధించి నిర్ణయం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా ఈ ఫండ్స్‌పై షార్ట్‌లాక్ వ్యవధి పెట్టుబడులకు ఆమోదం తెలపాలని సెబీ భావిస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన పేపర్లను లిక్విడ్ ఫండ్లు, డీఫాల్ట్ ఫండ్లుగా విభజించేందుకు సైతం అనుమతించాలని సెబీ భావిస్తోంది. 30 రోజులు, ఆపైన మెచూరిటీ అయ్యే అన్ని బాండ్లకు మార్కెట్ విలువను సంతరింపజేయాలని సెబీ భావిస్తోంది. ప్రస్తుతం 60 లేదా అంతకు మించిన రోజుల వ్యవధిలో మెచూరిటీ అయ్యే ఫండ్లకే మార్కెట్ వాల్యూ సెకూరిటీలను కల్పించేందుకు ఫండ్ హౌస్‌లకు వెసులుబాటు వుంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 42 శక్తిమంతమైన భాగస్వాములతో 22 లక్షల కోట్ల ఆస్తులు కలిగివుంది. మొత్తం 4.5 లక్షల కోట్ల లిక్విడ్ ఫండ్లు ఉండగా అందులో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ దాని అనుబంధ సంస్థల కారణంగా అనేక రుణాల తిరిగి చెల్లింపులు ఆగిపోయి డీఫాల్ట్ అయ్యాయి. దీంతో తీవ్రస్థాయిలో ద్రవ్యలభ్యతా లోపం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సెబీ కొన్ని దిద్దుబాటు చర్యలకు దిగింది. కాగా ద్రవ్య లభ్యత కలిగిన ఈ ఫండ్స్‌పై పెట్టుబడులపై షార్ట్‌లాక్ విదించడం సంస్థాగతంగా పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేస్తుందని క్వాంటమ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ జిమీ పటేల్ పేర్కొన్నారు. లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం, వెనక్కు తీసుకోవడంపై ఎలాంటి నిబంధనలు లేకపోవడంవల్ల అతిపెద్ద ద్రవ్య లభ్యతగల ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు, బ్యాంకులు తదిరత సంస్థాగత మదుపర్లు ప్రయత్నిస్తున్నారని, ఈక్రమంలో లాకిన్ పీరియడ్‌లో మార్పు అలాంటి పెట్టుబడిదారులపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయన్నారు. రీటెయిల్ రంగంలోని మదుపర్లకు మాత్రం ఇది లాభదాయకంగా ఉంటుందని బ్యాంక్ బజార్ కాం సేవింగ్స్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ విభాగం అధిపతి ఆదిత్య బజాజ్ తెలిపారు. మొత్తం ఆస్తుల విలువపై (ఎన్‌ఏవీ) లిక్విడ్ ఫండ్లలో అనూహ్యంగా వచ్చిన అధిక సంస్థాగత పెట్టుబడుల వల్ల ద్రవ్య లభ్యతపై తీవ్ర ప్రభావం చూపిందని, దీనిపై పరిమితి విధిస్తే సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయని బజాజ్ తెలిపారు.