బిజినెస్

ప్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాల మధ్య సెషన్ ఆరంభంలో ఆర్జించిన లాభాలను మార్కెట్లు చివరకు కోల్పోయి, నామమాత్రపు నష్టాలను చవిచూశాయి. ఇంధన, బ్యాంకింగ్, లోహ రంగాల షేర్ల ధరలు పెరిగినప్పటికీ, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి రంగాల షేర్లు నష్టపోవడం వల్ల మార్కెట్ కీలక సూచీలు పైకి ఎగబాకలేకపోయాయి. సెషన్‌లో జోరుగా కొనుగోళ్లు, తరువాత తీవ్ర స్థాయిలో అమ్మకాలు చోటు చేసుకోవడం వల్ల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ సుమారు 365 పాయింట్ల హెచ్చుతగ్గుల మధ్య కదలాడింది. బుధవారం ఉదయం పటిష్టమయిన స్థాయి 35,330.14 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్, ముడి చమురు ధరల తగ్గుదల, రూపాయి బలపడటం వంటి అంశాల ప్రేరణతో మరింత పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో 35,351.88 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, ఆసియాలోని చాలా మార్కెట్లలో నెలకొన్న బలహీన ధోరణితో పాటు ఐరోపా మార్కెట్లు దిగువ స్థాయిల వద్ద ప్రారంభం కావడం వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు దారితీశాయి. దీంతో ప్రతికూల జోన్‌లోకి దిగజారిన సెనె్సక్స్ 34,986.86 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు ఈ సూచీ క్రితం ముగింపుతో పోలిస్తే 2.50 పాయింట్ల (0.01 శాతం) దిగువన 35,141.99 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ మంగళవారం 332 పాయింట్లు పుంజుకుంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ బుధవారం 10,651.60- 10,532.70 పాయింట్ల మధ్య కదలాడింది. ఒకసారి కొనుగోళ్లు, తరువాత అమ్మకాలు జోరుగా సాగడంతో చివరకు ఈ సూచీ క్రితం ముగింపుతో పోలిస్తే 6.20 పాయింట్ల (0.06 శాతం) దిగువన 10,576.30 పాయింట్ల వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు తగ్గి, రూపాయి బలపడినప్పటికీ, దేశీయంగా ద్రవ్యలభ్యతపై ఆందోళనలు నెలకొనడంతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు బలహీనంగా ఉండటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం అనిశ్చితి చోటు చేసుకుందని విశే్లషకులు పేర్కొన్నారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో సన్ ఫార్మా బుధవారం అత్యధికంగా 7.36 శాతం నష్టపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సన్ ఫార్మా రూ. 218.82 కోట్ల నికర నష్టాలను చవిచూడటం ఈ కంపెనీ షేర్ల విలువ పడిపోవడానికి దారితీసింది. సాఫ్ట్‌వేర్‌ను ఎగుమతి చేసే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల షేర్ల విలువ 2.85 శాతం వరకు నష్టపోయింది. టాటా మోటార్స్ షేర్ల విలువ 1.67 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో కోటక్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, వేదాంత, హీరో మోటోకార్ప్, ఎల్‌అండ్‌టీ, రిల్, ఐటీసీ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 3.04 శాతం వరకు పడిపోయింది.