బిజినెస్

చెరకు రైతులకు సబ్సిడీ ఇవ్వకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, నవంబర్ 16: భారత్ చెరకు రైతులకు, చక్కెర ఉత్పత్తిదారులకు ఎడాపెడా సబ్సిడీలను ఇవ్వడం వల్ల చక్కెర ఉత్పత్తి పెరిగిందని, దీని వల్ల తమ దేశానికి నష్టంగా పరిణమించిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌లో ఈ ఏడాది చక్కెర 20 మిలియన్ టన్నుల నుంచి 35 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ విషయమై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయిస్తామని ఆస్ట్రేలియా హెచ్చరిం చింది. ప్రపంచ వ్యాప్తంగా చక్కెర ధరలు తగ్గడమే కాకుండా, తమ దేశ చక్కెర ఉత్పత్తిదారుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని తెలిపింది. ఈ వివరాలను ఏబీసీ న్యూస్ తెలిపింది. ఇలావుంటే, ఈ నెలాఖరులో ప్రపంచ వాణిజ్య సంస్థ వ్యవసాయ విభాగం సమావేశం జరగనుంది. భారత్ అనుసరిస్తున్న విధానాల వల్ల చక్కెర ఉత్పత్తులకు, ధరలకు విఘాతం కలుగుతోందని ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి సైమన్ బ్రిమ్మింగ్ హామ్ ఆరోపించారు. భారత్ విదానాల వల్ల చక్కెర మార్కెట్ అతలాకుతలమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చాలా సార్లు ఈ అంశాన్ని భారత్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారులతో మాట్లాడామని ఆయన చెప్పారు. భారత్‌తో చక్కెర విషయమై మళ్లీ చర్చలు నిర్వహిస్తామన్నారు. చెరకు రైతులకు, చక్కెర మిల్లులకు సబ్సిడీలను భారత్ సమీక్షిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో భారత్ రెండవ స్థానంలో, ఆస్ట్రేలియా మూడవ స్థానంలో ఉన్నయి. బ్రెజిల్ తదితర దేశాల నుంచి తమ డిమాండ్ విషయంలో మద్దతు ఉందన్నారు. ఈ అంశం వల్ల భారత్‌తో ఇతర విషయాల్లో సంబంధాలకు విఘాతం కలుగదన్నారు.