బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్ వాటాలకు పెరిగిన డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: జెట్ ఎయిర్‌వేస్ వాటాలకు శుక్రవారం హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. 14 శాతం వరకు ముందడుగు వేసిన ఈ సంస్థ షేర్ ధర 356.60 రూపాయలకు చేరింది. 299.75 రూపాయల వద్ద మొదలైన ట్రేడింగ్ ఆతర్వాత పుంజుకుంది. ఆర్థికంగా నష్టాల ఊబిలో అల్లాడుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ సిద్ధమైంది. కొనుగోలు ప్రక్రియపై చర్చించడానికి టాటా సన్స్ బోర్డు సమావేశం కానున్నదన్న వార్తతో జెట్ ఎయిర్‌వేస్ వాటాలకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. టాటా గ్రూప్ చేతికి వెళితే, జెట్ ఎయిర్‌వేస్ నష్టాల నుంచి బయటపడి, లాభాల బాట పడుతుందనే వాదన స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది.