రాష్ట్రీయం

రెండోరోజూ మార్కెట్లకు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు శుక్రవారం బలపడ్డాయి. విదేశీ పెట్టుబడులు తరలివస్తుండటంతో పాటు రూపాయి బలపడటం మార్కెట్లు లాభపడటానికి దోహదపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, ఇతర బ్లూచిప్ కంపెనీల షేర్లు రాణించడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ నాలుగు వారాల గరిష్ట స్థాయి 35,436.33 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 65.50 పాయింట్లు పుంజుకొని 10,682.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా వరుసగా మూడో వారం లాభపడ్డాయి. సెనె్సక్స్ ఈ వారంలో 298.61 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 97 పాయింట్లు పెరిగింది. సెనె్సక్స్ శుక్రవారం ఎగువ స్థాయి వద్ద ప్రారంభమయి, తరువాత మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 35,545.85 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల కొంత తగ్గి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 196.62 పాయింట్ల (0.56 శాతం) ఎగువన 35,457.16 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్ 17 తరువాత సెనె్సక్స్ ఇంత ఎగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 17న ఈ సూచీ 34,779.58 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ గురువారం నాటి లావాదేవీలలో కూడా 119 పాయింట్లు పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం 65.50 పాయింట్ల (0.62 శాతం) ఎగువన 10,682.20 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు ఈ సూచీ 10,695.15- 10,631.15 పాయింట్ల మధ్య కదలాడింది. భారతి ఎయిర్‌టెల్ నేతృత్వంలో వచ్చిన ర్యాలీ శుక్రవారం సెనె్సక్స్ పుంజుకోవడానికి దోహదపడింది. భారతి ఎయిర్‌టెల్ షేర్ల విలువ 9.81 శాతం పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) 2.79 శాతం లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. రిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత విలువయిన కంపెనీగా అవతరించింది. టీసీఎస్ షేర్ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 0.90 శాతం ఎగువన రూ. 1,882.25 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో రిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,14,668.54 కోట్లకు పెరగగా, టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,06,292.61 కోట్లకు చేరుకుంది. శుక్రవారం లాభపడిన ఇతర సంస్థల్లో హీరో మోటోకార్ప్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, ఐటీసీ, కోటక్ బ్యాంక్ ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ షేర్ల విలువ వరుసగా రెండో రోజు 8.07 శాతం పెరిగింది. మరోవైపు, యెస్ బ్యాంక్ 7.14 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, వేదాంత, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ తదితర కంపెనీలు ఉన్నాయి.