బిజినెస్

స్థిరపడుతున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: గత వారంతో పోలిస్తే, ఈవారం స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. సెనె్సక్స్ స్థిరపడుతున్నది. ఇటీవల కాలంలో బుల్న్ జోరందుకోవడంతో లాభాల బాటలో దూసుకెళ్లిన సెనె్సక్స్ గత వారం మొదటి రోజే నీరసించింది. ఐదు వందలకుపైగా పాయింట్లు పతనమైంది. రూపాయి మారకపు విలువ పడిపోవడం, చైనా-అమెరికా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొనడం సెనె్సక్స్ పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. ఆతర్వాత కూడా మార్కెట్ చెప్పుకోదగిన రీతిలో కోలుకోలేకపోయింది. రూపాయి మారకపు విలువను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని కార్పొరేట్ రంగం వ్యాఖ్యానించడం దేశంలో నెలకొన్న మాంద్యం పరిస్థితులకు అద్దం పడుతుంది. చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై కనిపించింది. చైనా దిగుమతయ్యే వివిధ వస్తువులపై అమెరికా సుంకాన్ని ఇప్పటికే పెంచేసింది. ఈ జాబితాలో తాజాగా మరికొన్ని వస్తుసేవలు కూడా జత కలవనున్నాయన్న వాదన బలంగా వినిపించింది. దీనితో రాబోయే కాలంలో షేర్ మార్కెట్ మరింత పడిపోతుందన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా, గత వారం మొత్తం అమ్మకాలు భారీగా పెరగడం సెనె్సక్స్‌ను దెబ్బతీసింది. దీనితో గత వారం చివరిలో సెనె్సక్స్ 32,300 పాయింట్లుగా నమోదైంది. అయితే, ఈవారం ప్రారంభలోనే 35,000 మైలురాయిని మరోసారి అధిగమించింది. 35,158.55 పాయింట్లతో మార్కెట్ ఆశాజనకంగా కనిపించింది. ఈ వారంలో స్థూలంగా చూస్తే 12వ తేదీన 34,812.99 పాయింట్లకు పడిపోవడాన్ని మినహాయిస్తే, స్టాక్ మార్కెట్ లాభాల్లో నడించిందనే చెప్పాలి. 35,000 పాయింట్ల కంటే అధికంగానే ట్రేడింగ్ జరిగింది. ఈవారం లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం 35,457.16 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ వచ్చే వారం కూడా స్థిరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ మార్పులకు దారితీసే పరిస్థితులు ఏవీ లేవుకాబట్టి, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) స్థిర ప్రాతిపదికన సాగుతుందని నిపుణుల అంచనా.