బిజినెస్

మొండి బకాయిదారుల వివరాలు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: బ్యాంకులకు ఉన్న మొండి బకాయిలు, బకాయిదార్లు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మొండి బకాయిలపై రాసిన లేఖ వివరాలను తమకు ఇవ్వాలంటూ సమాచార కమిషన్ కమిషనర్ ఆర్‌బీఐ, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. తాము అడిగిన వివరాలు సమకూర్చకపోవడం పట్ల సమాచార కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంస్థ 66 పేజీల లేఖను రాసింది. ఈ లేఖను శ్రీ్ధర్ ఆచార్యులు రాశారు. వివరాలు అందించడానికి చట్టపరమైన ఇబ్బందులు ఉంటే తెలియచేయాలని కోరారు. చట్టపరిధిలోకి రానందున రఘురాంరాజన్ లేఖ వివరాలను తాము ఇవ్వలేమని పీఎంఒ కార్యాలయం పేర్కొనడంపై సమాచార కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాంకు రుణాలను తీసుకుని ఎగవేసిన వారి జాబితా కావాలంటూ సందీప్ సింగ్ సమాచార కమిషన్‌ను ఆశ్రయింరు. అంతకు ముందు సమాచార కమిషన్ ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ సింగ్‌కు నోటీసును కూడా జారీ చేసింది. ప్రధానమంత్రి కార్యాలయానికి నైతికంగా, రాజ్యాంగపరంగా, రాజకీయ విధుల్లో భాగంగా వివరాలను అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆర్‌బీఐకు మంచి న్యాయ నిపుణులు ఉన్నారని, జాతీయ లా స్కూల్స్‌కు చెందిన న్యాయ కోవిదులు పనిచేస్తున్నారని, ఆర్‌టీఐ ఇచ్చిననోటీసుకు బదులివ్వకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా ఆర్‌బీఐకు పంపారు.