బిజినెస్

బలపడిన ఏడు పెద్ద కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలోని అత్యంత విలువయిన పది కంపెనీలలోని ఏడు కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 70,867 కోట్లు పెరిగింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్) మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. అలాగే, రిల్ తిరిగి దలాల్ స్ట్రీట్‌లో అత్యంత విలువయిన కంపెనీగా అవతరించింది. దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ను రెండో స్థానంలోకి నెట్టివేసింది. ఈ వారంలో తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను పెంచుకున్న సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉన్నాయి.
మరోవైపు, టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్ ఈ వారంలో తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)ను కొంత కోల్పోయాయి. చమురు నుంచి టెలికం వరకు వివిధ రంగాలకు విస్తరించి ఉన్న దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ ఈ వారంలో రూ. 21,646.06 కోట్లు పెరిగి, రూ. 7,14,668.54 కోట్లకు చేరింది. హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మార్కెట్ విలువ రూ. 3,939.66 కోట్లు పెరిగి, రూ. 3,65,988.02 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ ఎం-క్యాప్ రూ. 12,192.45 కోట్లు పెరిగి, రూ. 3,24,235.05 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 13,385.01 కోట్లు పెరిగి, రూ. 5,43,254.97 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,514.95 కోట్లు పుంజుకొని, రూ. 2,59,080.78 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 7,520.86 కోట్లు పెరిగి, రూ. 2,36,529.73 కోట్లకు చేరుకుంది. కోటక్ మహీంద్ర బ్యాంక్ తన మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను రూ. 5,667.87 కోట్లు పెంచుకోవడం ద్వారా టాప్ టెన్ క్లబ్‌లోకి ప్రవేశించింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో దీని మార్కెట్ విలువ రూ. 2,22,656.33 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, టీసీఎస్ మార్కెట్ విలువ ఈ వారంలో రూ. 10,337.82 కోట్లు తగ్గి, రూ. 7,06,292.61 కోట్లకు చేరుకుంది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,224.37 కోట్లు పడిపోయి, రూ. 3,38,232.56 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 4,805.24 కోట్లు తగ్గి, రూ. 2,84,142.38 కోట్లకు చేరుకుంది. ఈ టాప్ టెన్ కంపెనీలను ర్యాంకుల వారీగా చూస్తే, రిల్ అగ్రస్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉన్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 0.85 శాతం పుంజుకొని, 35,457.16 పాయింట్ల వద్ద ముగిసింది.