బిజినెస్

హోరెత్తిన డాలర్ల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో స్పాట్ మార్కెట్‌లో నికరంగా 18.662 బిలియన్ అమెరికన్ డాలర్లను విక్రయించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్‌బీఐ నికరంగా 16.301 బిలియన్ అమెరికన్ డాలర్లను కొనుగోలు చేయడం ద్వారా నికర కొనుగోలుదారుగా నిలిచింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ స్పాట్ మార్కెట్‌లో నికరంగా రూ. 31 మిలియన్ అమెరికన్ డాలర్లను విక్రయించినట్లు కేంద్ర బ్యాంకు తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఆర్‌బీఐ సెప్టెంబర్ నెలలో 1.012 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసి, 1.043 బిలియన్ డాలర్లను విక్రయించింది. కేంద్ర బ్యాంకు నికరంగా ఆగస్టు నెలలో 2.323 డాలర్లను, జూలై నెలలో 1.87 బిలియన్ డాలర్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో 2.483 బిలియన్ డాలర్లను, మే నెలలో 5.767 బిలియన్ డాలర్లను, జూన్ నెలలో 6.184 బిలియన్ డాలర్లను విక్రయించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
ఇదిలా ఉండగా, 2017 సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ నికరంగా డాలర్ల కొనుగోలుదారుగా నిలిచింది. ఆర్‌బీఐ సెప్టెంబర్‌లో నికరంగా 1.259 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసింది. ఈ నెలలో స్పాట్ మార్కెట్‌లో 3.788 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకు 2.529 బిలియన్ డాలర్లను విక్రయించింది. రూపాయి మారకం విలువలో అనిశ్చితిని నియంత్రించడానికి ఆర్‌బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో జోక్యం చేసుకుంది. రూపాయి విలువకు సంబంధించి ఒక స్థాయిని అది లక్ష్యంగా పెట్టుకోలేదు. అమెరికన్ డాలర్‌తో మారకంలో తీవ్రంగా పడిపోతున్న రూపాయి విలువను పరిరక్షించడానికి ఆర్‌బీఐ గత కొన్ని నెలలుగా స్పాట్ మార్కెట్‌లో క్రియాశీలకంగా జోక్యం చేసుకుంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ అక్టోబర్‌లో చరిత్రలో మొదటిసారి కనిష్ట స్థాయి 74.1 వద్దకు పడిపోయింది. ఇదిలా ఉండగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ స్పాట్ మార్కెట్‌లో నికరంగా 33.689 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసింది. స్పాట్ మార్కెట్ నుంచి 52.068 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకు, 18.379 బిలియన్ డాలర్లను విక్రయించింది. అంతకు ముందు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ నికరంగా 12.351 బిలియన్ అమెరికన్ డాలర్లను కొనుగోలు చేసింది.