బిజినెస్

15 శాతం తగ్గిన చక్కెర ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: మనదేశంలో ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో ఇప్పటి (నవంబర్ 15) వరకు చక్కెర ఉత్పత్తి 15 శాతం తగ్గింది. మొత్తం 1.16 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి ఇప్పటి వరకు జరిగిందని ఇండియన్ సుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) వెల్లడించింది. ఇప్పటికీ దేశంలోని అనేక చక్కెర కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభం కాలేదని సోమవారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇస్మా తెలియజేసింది. ఈ మార్కెటింగ్ యేడాది అక్టోబర్-సెప్టెంబర్ మాసాల్లో చక్కెర తయారీ 31.5 మిలియన్ టన్నులకు తగ్గుతుందని ఇస్మా ఇటీవల అంచనా వేసింది. గడచిన యేడాది ఇదే కాలంలో 32.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. గత జూలై మాసంలో ఇస్మా వేసిన అంచనాల మేరకు 35.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగకపోగా గడచిన యేడాదికన్నా తగ్గడం గమనార్హం. దేశంలో ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో చెరకు సాగు అధికంగా జరుగుతుంది. దేశం మొత్తం ఉత్పత్తిలో 80 శాతం ఈ రాష్ట్రాల నుంచే జరగడం గమనార్హం. అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా ఈ సంవత్సరం 349 చక్కెర కర్మాగారాల్లో చెరకు క్రషింగ్ ప్రారంభంకావడంతో గత యేడాది చక్కెర ఉత్పత్తి (1.37 మెట్రిక్ టన్నులు)కన్నా ఈ యేడాది 1.16 మెట్రిక్ టన్నులకు తగ్గిందని ఇస్మా వివరించింది. ఈక్రమంలోనే నవంబర్ 15 నాటికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని చక్కెర కార్మాగాలు 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే చేయగలిగాయని, గత సంవత్సరం ఇదే కాలానికి ఈ మిల్లులు 5.67 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని వివరించింది. కాగా ఈ యేడాది దేశ అవసరాల మేరకు 26 మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తి చేయడంతోబాటు 5 మెట్రిక్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసేవిధంగా లక్ష్యం ఉంది.