బిజినెస్

ప్యానెల్‌ను ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: అమెరికాతో ఏర్పడిన వాణిజ్య వివాదం పరిష్కారం దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. అమెరికా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై అధిక స్థాయిలో దిగుమతి సుంకాలను విధించడాన్ని వ్యతిరేకిస్తున్న భారత్.. ఈ అంశంపై ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయవలసిందిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను కోరింది. ఒక ఉన్నత స్థాయి అధికారి మంగళవారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు. డబ్ల్యూటీవోకు చెందిన వివాద పరిష్కార యంత్రాంగం కింద ఇరు దేశాలు జరిపిన ద్వైపాక్షిక సంప్రదింపుల ప్రక్రియలో వివాదాన్ని పరిష్కరించుకోవడంలో రెండు దేశాలు విఫలమయిన తరువాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూటీవోలో వివాద పరిష్కార ప్రక్రియలో సంప్రదింపులు జరపడం తొలి అడుగు. సంప్రదింపుల ద్వారా రెండు దేశాలు పరస్పరం ఒక అంగీకారానికి రాలేకపోతే, వాటిలోని ఏ దేశమయినా సదరు వివాదాన్ని సమీక్షించడానికి వివాద పరిష్కార ప్యానెల్‌ను ఏర్పాటు చేయవలసిందిగా డబ్ల్యూటీవోను కోరవచ్చు. ‘అందువల్ల, ఇప్పుడు భారత్.. వివాద పరిష్కార ప్యానెల్‌ను ఏర్పాటు చేయవలసిందిగా డబ్ల్యూటీవోను కోరింది’ అని ఆ అధికారి వివరించారు. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధిక స్థాయిలో దిగుమతి సుంకాలను విధించడం వల్ల భారత వ్యాపార సంస్థలు చేసే ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడింది. అధిక స్థాయిలో దిగుమతి సుంకాలను విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా కూడా లేదు. అమెరికా ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై పది శాతం చొప్పున దిగుమతి సుంకాలను విధిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌తో పాటు రష్యా, నార్వే, కెనడా, మెక్సికో, స్విట్జర్లాండ్, యూరోపియన్ యూనియన్‌లు డబ్ల్యూటీవోను ఆశ్రయించాయి.