బిజినెస్

అమ్మకాల హోరు.. మార్కెట్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల ర్యాలీకి తెరపడింది. ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు హోరెత్తడంతో దాని ప్రతికూల ప్రభావం మంగళవారం దేశీయ మార్కెట్లపై పడింది. దేశీయంగా రూపాయి బలపడటంతో పాటు చమురు ధరలు తగ్గినప్పటికీ, ప్రపంచ మార్కెట్ల ధోరణిని అనుసరిస్తూ మదుపరులు జోరుగా అమ్మకాలకు పూనుకోవడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 300కు పైగా పాయింట్లు పడిపోయింది. ఇటీవల ధరలు పెరిగిన షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం కూడా కీలక సూచీలు పడిపోవడానికి తోడ్పడింది. మంగళవారం ఉదయం దిగువ స్థాయి 35,730.77 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత అమ్మకాల ఒత్తిడితో మరింత దిగజారి ఇంట్రా-డేలో 35,416.18 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 300.37 పాయింట్ల (0.84 శాతం) దిగువన 35,474.51 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా విదేశీ నిధులు తరలివచ్చిన నేపథ్యంలో ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 633 పాయింట్లు పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా మంగళవారం 107.20 పాయింట్లు పడిపోయి, 10,656.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 10,640.85- 10,740.85 పాయింట్ల మధ్య కదలాడింది. బ్రెగ్జిట్‌పై పరిణామాలను మదుపరులు జాగ్రత్తగా గమనిస్తూ వస్తుండటంతో యూరోపియన్ సూచీలు దిగువ స్థాయి వద్ద ప్రారంభమయ్యాయని సాంక్చమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ సునిల్ శర్మ పేర్కొన్నారు. ‘ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని, ఇంధన రంగం లాభదాయకత పడిపోతుందనే ఆందోళనలతో పాటు వడ్డీ రేట్లు పెరుగుతుండటం అమెరికా మార్కెట్లలో అమ్మకాలకు దారితీసింది’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుండటం పట్ల మార్కెట్లు స్పందిస్తున్నాయని తెలిపారు. దేశీయ మార్కెట్లలో ప్రతికూల ధోరణిని ప్రతిబింబిస్తూ లోహ, టెక్నాలజి, హెల్త్‌కేర్ సహా అన్ని రంగాల సూచీలు మంగళవారం పడిపోయాయి.
యెస్ బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ రెంటాల చంద్రశేఖర్ సోమవారం తన పదవికి రాజీనామా చేయడంతో మంగళవారం ఆ బ్యాంక్ షేర్ ధర సెనె్సక్స్ ప్యాక్‌లోని అన్ని సంస్థలకన్నా ఎక్కువగా 6.10 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో టాటా స్టీల్, వేదాంత, ఎన్‌టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఓఎన్‌జీసీ, రిల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, హెచ్‌యూఎల్, ఆసియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ ఉన్నాయి. రూపాయి పటిష్టంగా ఉండటంతో సాఫ్ట్‌వేర్ సర్వీసులను ఎగుమతి చేసే సంస్థల షేర్ల ధరలు కూడా పడిపోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో షేర్ల విలువ 2.59 శాతం వరకు పడిపోయింది. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈ మెటల్ ఇండెక్స్ 2.82 శాతం పడిపోయింది. ఐటీ 1.74 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. టెక్నాలజి 1.58 శాతం, హెల్త్‌కేర్ 1.57 శాతం, పీఎస్‌యూ 1.15 శాతం, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ 1.08 శాతం, పవర్ ఒక శాతం పడిపోయాయి.