బిజినెస్

ఉత్పత్తులు పెరగాలంటే ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 21: ఉత్పత్తులను పెంచుకోవాలంటే తొలుత ఉద్యోగుల సంక్షేమం ప్రధానమని భారత దేశంలోని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఉద్యోగుల ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, సంతృప్తికరమైన సంబంధాల పట్ల సానుకూల వైఖరిని మెజారిటీ శాతం యాజమాన్యాలు ప్రదర్శిస్తున్నాయని ఇటీవల జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది. 1ది ఇండియా హెల్త్ అండ్ వెల్ బీయింగ్ స్టడీ-20182 పేరిట జరిగిన ఈ అధ్యనాన్ని విల్స్‌టవర్స్ వాట్సన్ అనే అంతర్జాతీయ సలహా, సమస్యల పరిష్కారాల సంస్థ గడచిన జూన్ నుంచి ఆగస్టు మాసం వరకు నిర్వహించింది. ఉద్యోగుల మానసిక వత్తిడిని పారద్రోలేందుకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ, కండిషన్ మేనేజ్‌మెంట్, శారీక బరువునియంత్రణ, పౌష్టికాహారం వంటి కార్యకలాల్లో ఏదో ఒకదాన్ని ఈ యేడాది 80 శాతానికి పైగా కంపెనీలు అనుసరించడం ప్రారంభించాయని అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 61 శాతం కంపెనీలు ఉద్యోగుల ఆర్థికాభివృద్ధిపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఐతే సర్వే చేసిన కంపెనీల్లో సగానికి పైగా ఇప్పటి వరకు ఉద్యోగుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరచకపోవడం కనిపించింది. సుమారు 100పైగా సంస్థల్లో ఉద్యోగులు, సిబ్బంది, మానవ హక్కు ల నేతల అభిప్రాయాలను ఈ సందర్భంగా అధ్యయన సంస్ధ సేకరించింది. ప్రధానంగా మానసిక ఆరోగ్యానికి చెందిన ప్యూహాన్ని సుమారు 66శాతం మం ది ఉద్యోగుల్లో ఇప్పటికి కొంతమంది అమలుచేస్తుండగా వచ్చే మూడేళ్లలో మిగిలినవారు అనుసరించనున్నారని అద్యయన నివేదిక వెల్లడించింది. తీవ్ర ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందస్తు ప్రణాళికలు చేపట్టేందుకు సుమారు 59 శాతం మంది ఉద్యోగులు సంసిద్ధత వ్యక్తం చేసినా ప్రస్తుతం కేవలం 8శాతం మందికి మాత్రమే ఈ సదుపాయాలు అందుతున్నాయని విల్స్ టవర్స్ వాట్సన్ భారత దేశ విభాగం అధిపతి రోహిత్ జైన్ తెలిపారు. కుటుంబం మొత్తం సం తోషంగా ఉంటే ఆ ప్రభావం పనిచేసే సంస్థ ఉత్పత్తిపై సానుకూలంగా ఉంటుందని మెజారిటీ శాతం ఉద్యోగులు అభిప్రాయపడ్డారని ఆయన తెలిపారు.