బిజినెస్

భారత-వియత్నాం బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనాయ్, నవంబర్ 21: పరస్పర రక్షణ సంబంధాలు, చమురు వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-వియత్నాం దేశాలు నిర్ణయించాయి. ప్రత్యేకించి దక్షిణ చైనా సముద్ర మార్గం మీదుగానూ, విమానయాన మార్గం ద్వారాను ఇరు దేశాల వాణిజ్య బంధాలను సరళతరం చేసుకోవడం ద్వారా ద్వైపాక్షిక బంధాలు బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా తన కార్యకలాపాలను విస్తృతం చేస్తున్న క్రమంలో భారత్-వియత్నాం దేశాలు తాజా నిర్ణయానికి వచ్చాయి. ఇటీవల భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ వియత్నాం పర్యటన సందర్భంగా జరిగిన చర్చల్లో ప్రధానంగా ఇరుదేశాల మధ్య రక్షణ, భత్రతా పరమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలను, బంధాలను బలోపేతం చేసుకోవాలన్న నిర్ణయం జరిగిందని ఇక్కడి విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.