బిజినెస్

మరింత పడిపోయిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు బుధవారం కూడా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర మరో రూ. 50 తగ్గి, రూ. 31,950కి చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న బలహీన ధోరణితో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ అంతగా లేకపోవడంతో పసిడి ధర తగ్గింది. గత రెండు రోజుల్లో కలిసి పది గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది. బంగారం బాటలోనే బులియన్ మార్కెట్‌లో వెండి ధర కూడా బుధవారం తగ్గింది. కిలో వెండి ధర రూ. వంద తగ్గి, రూ. 37,800కు చేరుకుంది. డాలర్ బలపడటం వల్ల పెట్టుబడులకు సురక్షితమయినదిగా భావించే బంగారానికి ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ పడిపోయిందని, అందుకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లో దాని ధర తగ్గిందని వ్యాపారులు చెప్పారు. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే, సింగపూర్‌లో బంగారం ధర 0.05 శాతం తగ్గి, ఒక ఔన్స్‌కు 1,221.50 అమెరికన్ డాలర్లకు చేరింది. వెండి ధర నిలకడగా, ఒక ఔన్స్‌కు 14.40 అమెరికన్ డాలర్లుగా ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో స్థానిక నగల వ్యాపారులతో పాటు రిటెయిలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గి, రూ. 31,950కి చేరింది. అలాగే, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర కూడా రూ. 50 తగ్గి, రూ. 31,800కు చేరింది. సావరిన్ గోల్డ్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ. 24,800 వద్ద కొనసాగింది. కిలో వెండి ధర రూ. వంద తగ్గి, రూ. 37,800కు చేరింది. అలాగే, వారం ప్రాతిపదికన డెలివరీ చేసే వెండి ధర కిలోకు రూ. 183 తగ్గి, రూ. 36,586కు చేరింది. వెండి నాణేల ధరలో మాత్రం ఎలాంటి మార్పులేదు. వంద వెండి నాణేల కొనుగోలు ధర రూ. 73,000, విక్రయ ధర రూ. 74,000 వద్ద కొనసాగింది.