బిజినెస్

రెండోరోజూ నష్టాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు బుధవారం కూడా నష్టపోయాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్న తరుణంలో ఐటీ, టెక్నాలజి, లోహ, వాహన రంగాల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 250కి పైగా పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 56 పాయింట్లు దిగజారి, 10,600 పాయింట్ల స్థాయికి చేరుకుంది. విదేశీ నిధులు తాజాగా తరలిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే, చమురు సరఫరాలు డిమాండ్‌కు మించి పోతాయనే ఆందోళనలతో ప్రపంచ మార్కెట్‌లో వాటి ధరలు 13నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం దేశీయ మార్కెట్ కీలక సూచీలు మరింత పడిపోకుండా నివారించింది. బీఎస్‌ఈ సెనె్సక్స్ బుధవారం సెషన్ ప్రారంభంలో స్వల్పంగా పుంజుకొని, 35,494.25 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ, తరువాత కొద్ది సేపటికే ఇతర ఆసియా మార్కెట్లలో నెలకొన్న బలహీన ధోరణిని అనుసరిస్తూ ప్రతికూల జోన్‌లోకి జారిపోయి, 35,112.49 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే, యూరోపియన్ మార్కెట్లలో సూచీలు అధిక స్థాయి వద్ద ప్రారంభం కావడంతో తిరిగి కొనుగోళ్ల మద్దతు లభించడం వల్ల ఈ సూచీ అంతకు ముందు జరిగిన నష్టాన్ని కొంత వరకు పూడ్చుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 274.71 పాయింట్ల (0.77 శాతం) దిగువన 35,199.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ మంగళవారం కూడా 300.37 పాయింట్లు కోల్పోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా బుధవారం 56.15 పాయింట్లు (0.53 శాతం) పడిపోయి, 10,600.05 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,562.35- 10,671.30 పాయింట్ల మధ్య కదలాడింది. ఆదాయాలు తక్కువగా ఉన్న తరుణంలో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 13 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల ఇంధన రంగ షేర్ల విలువ పడిపోయింది. ఈ రంగం షేర్ల నేతృత్వంలో మంగళవారం అమెరికా మార్కెట్‌లో తాజాగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రతికూల ప్రభావం వల్ల ఆసియా మార్కెట్లలో కూడా సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో పాటు అమెరికా-చైనా వాణిజ్య వివాదాలు కూడా ఆర్థిక వృద్ధి పడిపోతుందనే ఆందోళనలను మరింత తీవ్రం చేసిందని బ్రోకర్లు చెప్పారు. బుధవారం నాటి లావాదేవీలలో సాఫ్ట్‌వేర్ సర్వీసులను ఎగుమతి చేసే సంస్థలయిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర షేర్లు 3.55 శాతం వరకు నష్టపోయాయి. నష్టపోయిన ఇతర సంస్థల్లో పవర్‌గ్రిడ్, రిల్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎంఅండ్‌ఎం, హీరో మోటోకార్ప్, వేదాంత, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతి ఎయిర్‌టెల్, కోల్ ఇండియా ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.77 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, ప్రైవేటు రంగ బ్యాంకు యెస్ బ్యాంక్ అత్యధికంగా 2.83 శాతం లాభపడింది. లాభపడిన ఇతర సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, సన్ ఫార్మా, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.20 శాతం వరకు పెరిగింది.