బిజినెస్

21 నుంచి 26 వరకు స్తంభించనున్న బ్యాంకు లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: ఈ నెలలో ఐదురోజుల పాటు జాతీయ బ్యాంకుల్లో అన్ని రకాల లావాదేవీలు స్తంభించి పోతున్నాయి. 21 నుంచి కేవలం ఒక్క 24 తేదీ మినహా 26వ తేదీ వరకు దాదాపు జాతీయ బ్యాంకులన్నీ మూతబడతున్నాయి. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్‌ల ఆధ్వర్యంలో 21, 26 తేదీల్లో దేశ వ్యాప్త సమ్మె జరగనుంది. అయితే 21వ తేదీ ఆఫీసర్లు మాత్రమే సమ్మెలో పాల్గొంటారని 26న అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని కొన్ని సంఘాల నేతలు చెబుతున్నారు. 21న దేశ వ్యాప్త సమ్మెకు దిగుతున్నామని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కానె్ఫడరేషన్ గురువారం ప్రకటించింది. ఉద్యోగ సంఘాలు వీరికి మద్దతునిస్తున్నాయి. ఇక 22, 23 శని, ఆదివారాలు, 25వ తేదీ క్రిస్మస్ కారణంగా బ్యాంక్‌లకు సెలవు.