బిజినెస్

మూడోరోజూ నష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉండటంతో పాటు రూపాయి బలహీనపడటం, దేశీయ, విదేశీ మదుపరులు విక్రయాలకు పూనుకోవడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు గురువారం నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 572.28 పాయింట్లు (1.59 శాతం) పడిపోయి, 35,312.13 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 181.75 పాయింట్లు (1.69 శాతం) దిగజారి, 10,601.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. లోహ, చమురు- సహజ వాయువు, ఫార్మా, ఫైనాన్సియల్ స్టాక్స్ సహా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీలు కూడా దిగజారాయి. అమెరికా, చైనా మధ్య తాజాగా ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయని మార్కెట్ విశే్లషకులు పేర్కొన్నారు. రష్యా, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గిస్తాయనే అంచనాలతో వాటి ధరలు పెరుగుతున్నాయి. రూపాయి మరింత బలహీనపడుతోంది. గురువారం ఇంట్రా-డేలో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 36 పైసల దిగువన 70.82 వద్ద కొనసాగింది. అమెరికన్ కరెన్సీ బలపడటంతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్ బలహీనంగా ఉండటం వల్ల డాలర్‌తో రూపాయి మారకం విలువ గురువారం ఇంట్రా-డేలో ఒక దశలో కనిష్ట స్థాయి 71 వద్దకు పడిపోయింది. కీలకమయిన ఒపెక్ దేశాల సమావేశం జరుగనున్న తరుణంలో చమురు ధరలు స్టాక్ మార్కెట్ల నష్టానికి దారితీశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రధానమయిన బ్రెంట్ ముడి చమురు ధర 1.82 శాతం దిగువన పీపాకు 59.74 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
గురువారం నాటి లావాదేవీలలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యెస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్, ఆసియన్ పెయింట్స్, ఓఎన్‌జీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), కోటక్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ప్రధానంగా నష్టపోయాయి. వీటి షేర్ల విలువ అయిదు శాతం పడిపోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఒక్క సన్‌ఫార్మా మాత్రమే లాభపడింది. ఈ కంపెనీ షేర్ ధర 1.57 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం నికరంగా రూ. 357.82 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) కూడా రూ. 791.59 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. మిగతా ఆసియా దేశాలయిన కొరియా, జపాన్, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు కూడా గురువారం నష్టపోయాయి. యూరప్‌లో చూస్తే, ఫ్రాంక్‌ఫర్ట్, పారిస్ మార్కెట్లు కూడా తొలి లావాదేవీలలో నష్టాలను చవిచూశాయి. లండన్ ఎఫ్‌టీఎస్‌ఈ కూడా 2.50 శాతం పడిపోయింది.