బిజినెస్

గీతంతో కలిసి పనికి హెచ్‌సీఎల్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 6: ప్రఖ్యాత ఐటీ రంగ సంస్థ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) గీతం డీమ్డ్ యూనివర్శిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. రెండు రోజుల పాటు గీతం యూనివర్శిటీలో సందర్శించిన సంస్థ బృంద నైపుణ్యం కలిగిన యువత కోసం గీతంతో కలిసి పనిచేసేందుకు నిర్ణయించినట్టు హెచ్‌సీఎల్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శివశంకర్ గురువారం తెలిపారు. ఇటీవలే అమరావతిలో ప్రాంగణం ఏర్పాటు చేసిన హెచ్‌సీఎల్ సంస్థ అవసరమైన నిపుణతతో కూడిన యువత కోసం అనే్వషిస్తున్న తమకు గీతం చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చినట్టు ఆమె వెల్లడించారు. ముందుగా గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం భరత్‌తో ఉపాధ్యక్షురాలు సహా సెంటర్ హెడ్ సుబ్రహ్మణ్యం, రిక్రూట్‌మెంట్ విభాగం డిప్యూటీ మేనేజర్ షేక్ మహ్మద్ ఆలీషా సమావేశమయ్యారు. అనంతరం గీతం వైస్‌ఛాన్స్‌లర్ ఎంఎస్ ప్రసాదరావు తదితరులతో చర్చిస్తూ అమరావతిలో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించనున్న తమ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డి)పై ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్‌గా అమరావతి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఐటీ రంగంలో రాణిస్తున్న వారికి వెనక్కు రప్పించే ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. స్థానికంగా ఉండే యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తామని, ఇందుకు గాను గీతం వంటి సంస్థతో దీర్ఘకాలిక అనుబంధానికి ఆసక్తితో ఉన్నామన్నారు. ఇతర దేశాల్లో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఎందరో గీతం పూర్వ విద్యార్థులు అమరావతి హెచ్‌సీఎల్ కేంద్రంలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో హెచ్‌సీఎల్ కార్యకలాపాలను ఆమె వివరించారు. గీతం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ ఇప్పటికే తాము రెడ్డీస్ ల్యాబ్, లారస్‌ల్యాబ్ వంటి పరిశ్రమలతో కలిసి పనిచేస్తున్నామని, హెచ్‌సీఎల్‌కు కూడా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. గీతం ప్రాంగణంలో అంతర్జాతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్, ఎనలిటిక్స్ వంటి కోర్సుల పట్ల హెచ్‌సీఎల్ ఆసక్తి చూపడం అభినందనీయమన్నారు. సమావేశంలో గీతం ప్రో వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ఎం పోతరాజు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..గీతం డీమ్డ్ యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు,
తదితరులతో చర్చిస్తున్న హెచ్‌సీఎల్ ఉపాధ్యక్షురాలు శివశంకర్