బిజినెస్

నిరుత్సాహంగా స్టాక్ మార్కెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: ఈవారం మొత్తం మీద స్టాక్ మార్కెట్ పరిస్థితులను, లావాదేవీలు తీరుతెన్నులను పరిశీలిస్తే, నిరుత్సాహంగా కొనసాగిందనే విషయం స్పష్టమవుతుంది. వరుసగా మూడు రోజుల నష్టాల నుంచి లావాదేవల చివరి రోజైన శుక్రవారం కొంత వరకూ కోలుకొని, 361.12 పాయింట్ల మేరకు లాభపడినప్పటికీ, వారం మొత్తాన్ని సమీక్షిస్తే మాత్రం నిరాజనకంగానే కనిపించింది. మొత్తం మీద సెనె్సక్స్ ఈవారం 521.05 పాయింట్లు (1.43 శాతం) నష్టపోయింది. అదే విధంగా నిఫ్టీ కూడా నష్టాలను ఎదుర్కొంది. 183.05 పాయింట్లు (1.68 శాతం) నష్టపోయింది. అయితే, వారాంతంలో కొంత మెరుగు పడడంతో, శని, ఆది వారాల్లో సెలవు అనంతరం సోమవారం ప్రారంభమయ్యే వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఆశాజనకంగానే ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మహీంద్ర బ్యాంక్ వంటి కొన్ని స్టాక్స్ మాత్రమే లాభాలను ఆర్జించగా, ఎక్కువ శాతం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం నుంచి జీ-20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వరకూ అనేకానేక అంతర్జాతీయ పరిణామాలు, అంశాలు స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. అదే విధంగా దేశీయ మదుపరులు కూడా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మక్కువ చూపడంతో, ఈవారం స్టాక్ మార్కెట్ మందగొడిగా సాగింది. కాగా, బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం సెనె్సక్స్ 361.12 పాయింట్లు, నిఫ్టీ 92.55 పాయింట్లు మెరుగు పడడాన్ని మినహాయిస్తే, స్థూలంగా స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈనెల 11వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో, వచ్చే వారం చివరిలో స్టాక్ మార్కెట్‌లో లాభాల సూచీలు సాధ్యమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఈవారం చివరి రోజునాటి ట్రేడింగ్‌లో ముప్పయికిగాను ఇరవై ఒక్క కంపెనీల స్టాక్స్ ఈ సీజన్‌లోనే అత్యధిక ధరను నమోదు చేశాయి. కోటక్ మహీంద్ర అత్యధికంగా 8.53 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్ (2.71 శాతం), బజాజ్ ఆటో (2.23 శాతం), ఇన్ఫోసిస్ (1.92 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.82 శాతం) కూడా లాభపడిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.
ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలంగా పని చేసింది. ఒక్కోసారి ఒక్కో తరహా పరిణామాలు, వార్తలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఈ ప్రభావం బీఎస్‌ఈపైనా కనిపించింది. అనిశ్చితి కొనసాగడమే ఇందుకు ఉదాహరణగా పేర్కోవాలి. సెంటిమెంట్ ఎప్పుడు, ఎటువైపు మళ్లుతుందో, ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రతికూలంగా మారుతుందో చెప్పడం కష్టమన్నది వాస్తవం. మార్కెట్ తీరును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వచ్చే వారం ఇదే అనిశ్చితి కొనసాగుతుందా లేక సానుకూల వాతావరణం నెలకొంటుందా అనే ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లభించడం లేదు.