బిజినెస్

జూబిలెంట్ లైఫ్‌పై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నాణ్యతాపరమైన లోపాలను గుర్తించామని, ఈ కారణంగా జూబిలెంట్ లైఫ్ సంస్థ రూర్కీ శాఖపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అమెరికా ఆహార, ఔషధ పలనా విభాగం (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఆదేశించింది. రూర్కలోని జూబిలెంట్ లైఫ్ శాఖలో ఇటీవల ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఔషధాలను తయారు చేసే ప్లాంట్, ఇతర విభాగాల్లో కొన్ని లోపాలను గుర్తించారు. అత్యంత కీలకమైన ఔషధ ఉత్పత్తుల్లో ఎలాంటి పొరపాట్లను సహించేది లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తెచ్చారు. ఇలావుంటే, పాలనాపరమైన పొరపాట్లు కూడా ఉన్నాయని, వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందని యూఎస్‌ఎఫ్‌డీఏ వ్యాఖ్యానించింది. లోపాలకు సంబంధించి తనిఖీ అధికారులు గుర్తించిన అంశాలపై 90 రోజుల్లోగా కంపెనీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈలోగా శాఖాపరమైన చర్య అనివార్యమవుతుందని వివరించింది.