బిజినెస్

ప్రణాళిక బాగుంటే మంచి ఫలితాలు వచ్చేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: ఇబ్బందుల్లో బ్యాంకులకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కోటక్ మహేంద్ర బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ స్వాగతించారు. ఆదివారం నాడిక్కడ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణియన్ రచించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు వేల రూపాయల కరెన్సీ నోట్లను తీసుకురావడం వంటి చిన్నచిన్న అంశాలు చోటుచేసుకోకపోతే వివాదాస్పద డీమానిటరైజేషన్ ఫలితాలు బాగానే వుండేవని దేశంలో నాలుగో అతిపెద్ద బ్యాంకర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చిన్న వ్యాపార రంగం ఇబ్బందుల్లో ఉందన్నారు. డీమానిటరైజేషన్ విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించివుంటే మంచి ఫలితాలే వచ్చేవని అన్నారు. రూ.500, రూ.1000 నోట్లను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినపుడు అంతకన్నా పెద్దనోటు రూ.2000ను తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిర్వహణ వ్యూహంలో భాగంగా సక్రమ డినామినేషన్ కరెన్సీని పెద్దమొత్తంలో అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరాన్ని గ్రహించలేకపోయారని ఆయన అన్నారు. అయితే డీమానిటరైజేషన్ ఆర్థిక రంగాభివృద్ధికి బాగా దోహదం చేసిందని, ఆర్థిక పరమైన పొదుపులో మాత్రం అనూహ్యమైన అభివృద్ధి కనిపించిందని ఆయన తెలిపారు. క్లిష్ట తరమైన లక్ష్యాలవైపు మళ్లడం మాత్రం సవాలుగా మారిందన్నారు. దేశంలో నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టడం కోసమంటూ రూ 500, 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి 2016 నవంబర్ 8న ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే తర్వాత అంచనాలేవీ ఫలించకపోగా రద్దుచేసిన నోట్లలో 99.3 శాతం నోట్లు, అంటే 15.8 ట్రిలియన్ నోట్లు మళ్లీ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేశాయని కోటక్ తెలిపారు. ఆర్బీఐ 2000 రూపాయల నోటును విడుదల చేసిన రోజు సాయంత్రమే సెంట్రల్ బ్యాంకు కూడా రూ.200 నోట్లను విడుదల చేసింది. ఈ పరిణామం దేశంలో చిన్న తరహా వ్యాపార రంగ ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని ఆయన విశే్లషించారు.