బిజినెస్

70వ దశకంలోనే పాన్ కార్డును రూపొందించిన టీసీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలో ఆదాయం పన్ను చెల్లింపుదార్లు, పన్ను పరిపాలనపై ఒక సమగ్ర విధానాన్ని టాటా కనె్సల్టెన్సీ సర్వీసస్ 70వ దశకంలోనే రూపొందించింది. దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదనను అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ వివరాలను మేనేజిమెంట్ వ్యూహకర్త శశాంక్ షా ది టాటా గ్రూప్ టార్స్ బేరర్స్ టు ట్రైల్ బ్లేజర్స్ అనే పుస్తకంలో వెల్లడించారు. టాటా గ్రూపును స్థాపించి 150 ఏళ్లు గడిచింది. ఈ నేపథ్యంలో 1969లో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. ఆ సమయంలో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. బ్యాంకుల్లో కంప్యూటీకరణకు ఆ నాటి ప్రభుత్వం మొగ్గుచూపలేదు. కంప్యూటీకరణ వల్ల నిరుద్యోగం పెరుగుతుందని భావించింది. ఆ రోజుల్లోనే ఆదాయం పన్ను చెల్లింపుదార్ల కోసం పాన్ కార్డును టీసీఎస్ రూపొందించింది. ఆర్థిక శాఖలో కంప్యూటీకరణ వద్దని ఆర్థిక శాఖ మంత్రి అన్నారని, రచయిత శశాంక్‌షా పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించింది. అప్పుడే పాన్ కార్డుకు ప్రభుత్వం అనుమతించి ఉంటే, ఈ రోజు అన్ని దేశాల కంటే అగ్రగామిగా ఉండేదని ఆయన అన్నారు.
అన్ని రకాల ఐటీ లావాదేవీలకు పాన్ కార్డు నంబర్‌ను రాయాలనే నిబంధనను 2005 జనవరి 1వతేదీ నుంచి అమలు చేశారు. 1920లో టాటా స్టీల్‌ప్లాంట్స్‌లో పారిశ్రామిక శాంతి నెలకొనేందుకు మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సహకరించారన్నారు. 1920 నుంచి 1924 మధ్య టాటా స్టీల్ పరిశ్రమలో మూడు సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెను విరమింపచేసేందుకు మహాత్మాగాంధీ జెంషెడ్‌పూర్‌కు వచ్చారు. ఆ రోజుల్లో సుభాష్ చంద్రబోస్ కార్మికులకు అండగా నిలబడ్డారు. జెంషెడ్‌పూర్ కార్మిక సంఘం నేతగా సుభాష్‌చంద్రబోస్ ఉన్నారు. 1932 నాటికి స్వాతంత్య్ర ఉద్యమంలో బోస్ చురుకుగా పాల్గొనడంతో కార్మిక సంఘాల కార్యకలాపాలు తగ్గించారు. కార్మికులతో చర్చలు సామరస్యంగా జరిగేందుకు టాటా యాజమాన్యం ఆ రోజుల్లో డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, జవహర్‌లాల్ నెహ్రూల సహకారం తీసుకుంది.