బిజినెస్

చెరువుల లెక్క తేలుస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 9: ఆక్వా రంగం మీద ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఆక్వా జోన్లను ప్రకటించనుంది. ఇప్పటికే 9 జిల్లాల్లో సర్వే పనులను పూర్తిచేసి, జిల్లాల వారీగా లెక్క తేల్చింది. దీంతో ఇక నుంచి ఎక్కడ పడితే అక్కడ చెరువులు తవ్వితే చట్టపరంగా కఠినమైన చర్యలు అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా ఆక్వా జోన్లను ప్రకటించిన తర్వాత తవ్విన చెరువులో ఏం పెంచుతున్నారో ప్రభుత్వానికి తప్పనిసరిగా చెప్పాలి. తద్వారా ఆ చెరువులకు కావలసిన వౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందివ్వనుంది. ఇప్పటికే నష్టాల బారిన పడుతున్న ఆక్వా రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ యూనిట్ రూ.2కు ప్రకటించారు. జోన్ల వ్యవస్థను ప్రకటించిన తర్వాత ఆక్వా రైతుల కోసం సీడ్ నుంచి ఫీడ్ వరకు, కోల్డ్ స్టోరేజ్‌లు తదితర వాటిని ప్రభుత్వం ఆక్వా రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోనుంది.
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా వృద్ధి సాధించడంలో ముందంజలో ఉన్న ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే కాకుండా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలు కనిపించడం వల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోంది. మరోపక్క ఆదాయం కోసం రైతులు ఎక్కడ పడితే అక్కడ చెరువులు తవ్వడంతో వీటి పైన ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీలు రాష్టవ్య్రాప్తంగా పర్యటించి, ఆయా జిల్లాల్లో అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటిలో చేపలు, రొయ్యలు పండిస్తున్నవి ఎన్ని ఉన్నాయో పరిశీలించిన మత్స్యశాఖ ఒక అంచనాకు వచ్చింది. ఇప్పుడు ప్రకటించనున్న ఆక్వా జోన్లతో వాటిని క్రమబద్ధీకరిస్తున్నారు. దీంతో నిర్ణీత జోన్ పరిధిలోనే సాగుచేసుకోవాలి. ముఖ్యంగా ఈ జోన్ల వల్ల వ్యవసాయ రంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వరి పండించే భూముల్లో వరి, జోన్ల పరిధిలో ఉన్న భూముల్లో ఆక్వా ఉత్పత్తులను పెంచుతారు. ప్రస్తుతం వ్యవసాయానికి ఉపయోగపడే భూముల్లో కూడా అంతర్జాతీయంగా రొయ్యకు మంచి డిమాండ్ ఉండటంతో సన్న, చిన్నకారు రైతులంతా ఆక్వా రంగం పైనే దృష్టి సారించారు. మరోపక్క ఎంపెడా కూడా ఆక్వా చెరువులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే విదేశాలకు ఎగుమతి అవుతున్న మన రాష్ట్రానికి చెందిన కంటైనర్లలో యాంటీ బయోటిక్స్ ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తిరిగి రాష్ట్రానికి తరలివస్తున్నాయి. దీంతో ఎంపెడా కూడా చెరువులకు జియోట్యాగింగ్ చేయడం ప్రారంభించింది. అంతర్జాతీయంగా ఉన్న వాణిజ్య చట్టాల ప్రకారం ఏ చెరువులో ఆక్వా ఉత్పత్తులు పెంచారో ఇక నుంచి ఎగుమతి చేసే కవర్లపై ముద్రించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ అనుమతి పొందినవి, అనుమతులు లేని చెరువులను లెక్కతేలుస్తున్న ప్రభుత్వం ఆక్వా జోన్ల ద్వారా అనే క సమస్యలకు స్వస్తి పలకనుంది. ఇక ఆక్వా రాజధానిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో 67,518 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోందని, ఇంకా 13,355 హెక్టార్లు సాగుకు అనువుగా ఉందని తేల్చింది. అంతేకాకుండా జిల్లాలో 29 మండలాల్లో సాగు జరుగుతున్నట్టు ప్రభుత్వానికి తెలపనుంది.