బిజినెస్

మార్కెట్‌లో అనిశ్చితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నది. గత వారం లావాదేవీలను బట్టి చూస్తే, సోమవారం నుంచి ప్రారంభం కానున్న కొత్త వారంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిని రేపుతున్నది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇదే వారం వెలువడనున్న నేపథ్యంలో, స్టాక్ మార్కెట్‌పై వాటి ప్రభావం తప్పకుండా కనిపిస్తుందనేది వాస్తవం. ఈనెల 11న, మంగళవారం కౌటింగ్ జరిగి, ఫలితాలు వెల్లడవుతాయి. కాబట్టి, కొత్త వారం మొదటి రోజున లావాదేవీల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉండవని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఫలితాల సరళి ప్రారంభమైన మరుక్షణం నుంచే స్టాక్ మార్కెట్‌లో లావాదేవీల తీరుతెన్నులు మారతాయని స్పష్టం చేస్తున్నారు. గత వారం స్టాక్ మార్కెట్‌ను గమనిస్తే, వరుసగా మూడు రోజుల నష్టాల నుంచి బయటపడిన సెనె్సక్స్ శుక్రవారం కొద్దిగా మెరుగుపడింది. అయితే, గతవారంలో ట్రేడింగ్‌కు అదే చివరి రోజు కావడంతో, తదుపరి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు వీల్లేకపోయింది. శని, ఆది వారాల్లో చెప్పుకోదగ్గ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా లేదు. ఈ కోణంలో చూస్తే, దేశీయంగా రాజకీయ రంగంలో జరిగే మార్పులే స్టాక్ మార్కెట్‌ను శాసిస్తాయని అనుకోవచ్చు. ఈ వారంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలే దేశ రాజకీయ రంగం తీరుతెన్నులను ఖాయం చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో స్టాక్ మార్కెట్ క్రియాశీలురంతా ఫలితాల తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకే ప్రజా మద్దతు లభిస్తే, మార్కెట్ లావాదేవీల్లో భారీ మార్పులు ఉండకపోవచ్చు. అందుకు భిన్నంగా, ప్రతిపక్ష పార్టీలు లేదా కూటములు అధికార పగ్గాలను చేపడితే, స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు తప్పవు. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే ఈవారం స్టాక్ మార్కెట్ తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయి.
గతంలో మాదిరిగానే ముడి చమురు ధర, డాలర్‌కు రూపాయి మారకపు విలువ, చైనా-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వంటి పలు అంశాలు అంతర్జాతీయ మార్కెట్లను ఈవారం కూడా ప్రభావితం చేస్తాయి. దేశీయ మదుపరులు క్రియాశీలకంగా వ్యవహరిస్తే తప్ప, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం నుంచి బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ తప్పించుకునే అవకాశం లేదన్నది వాస్తవం. గత వారం కోటక్ మహీంద్ర బ్యాంక్ అత్యధికంగా లాభపడగా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీల వాటాలు కూడా లాభాలను ఆర్జించాయి. ఇదే దూకుడు కొత్త వారంలోనూ కొనసాగితే, మరికొన్ని కంపెనీలు కూడా లాభాల బాటపట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థల వద్ద వాటాలను కొనుగోలు చేయడానికి వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే కొనుగోలు చేయనున్నదన్న వార్త కోటక్ మహీంద్ర బ్యాంక్ వాటల డిమాండ్‌కు ప్రధాన కారణమైంది. ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగం మెరుగైన ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో, విదేశీ మదుపరులు, సంస్థలు ఈ రంగంవైపు మొక్గు చూపుతున్నట్టు మార్కెట్ సరళి స్పష్టం చేస్తున్నది. వచ్చే వారం కూడా ఇదే తరహా ట్రేడింగ్ ఉంటుందని అంచనా.