బిజినెస్

ఎఫ్‌డిఐ నిబంధనలకు అనుగుణంగా ఎఓపి విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: దేశంలో ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ల (ఎఓపి) మంజూరుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని త్వరలో సవరిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశీయ విమానాయాన సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎఓపి విధానాన్ని సవరించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. అంతేకాకుండా 49 శాతానికిపైగ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్న వివిధ దేశాల్లోని విమానయాన సంస్థల్లో యాజమాన్య స్వరూపం, నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఏవిధంగా ఉన్నాయన్న విషయాన్ని కూడా పరిశీలిస్తామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్.చౌబే న్యూఢిల్లీలో విలేఖరులకు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలో ఏ సంస్థకైనా దాని చైర్మన్, డైరెక్టర్లలో మూడింట రెండు వంతుల మంది భారత పౌరులు అయి ఉండటంతో పాటు ఆ సంస్థ యాజమాన్యం, అజమాయిషీ భారతీయుల చేతిలో ఉంటేనే ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ లేదా ఫ్లయింగ్ లైసెన్సు మంజూరు చేయడం జరుగుతోంది. ఈ విధానాన్ని సవరించి దీనిని దేశీయ విమానయాన రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వాలన్న విధానానికి పూర్తి అనుగుణంగా మార్చడం జరుగుతుందని చౌబే స్పష్టం చేశారు.