బిజినెస్

ఎగ్జిట్ పోల్స్ ఫలితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 10: గత వారం వరుస నష్టాల నుంచి చివరిలో బయటపడిన స్టాక్ మార్కెట్ ఈవారం మొదటి రోజు, సోమవారం నష్టాలతో మొదలైంది. కొంతకాలంగా మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మార్కెట్ కుదుటపడలేదని తాజా సెనె్సక్స్ సూచీలు స్పష్టం చేస్తున్నాయి. అమ్మకాల ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో ఏకంగా 713.53 పాయింట్లు నష్టపోయిన సెనె్సక్స్ 34,959.72 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 205.25 పాయింట్లు (1.92 శాతం) నష్టాలను చవిచూసి, 10,488.45 పాయింట్లకు పడిపోయింది. లాభాలతో మొదలవుతుందనుకున్న సెనె్సక్స్ మొదటి రోజునే రెండు శాతం నష్టపోవడానికి ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడడమేనని నిపుణులు అంటున్నారు. గత వారం చివరిలో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, దేశీయ మదుపరుల కారణంగా ఆ లోటు దాదాపుగా భర్తీ అయింది. కానీ, సోమవారం ట్రేడింగ్‌లో అటు విదేశీ మదుపరులు, ఇటు దేశీయ పెట్టుబడిదారులు కూడా అనాసక్తిని ప్రదర్శించడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు అనుకున్న స్థాయిలో సాగలేదు. తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయంపై ఎవరికీ స్పష్టమైన అవగాహన లేని కారణంగా ఈ వారం ట్రేడింగ్ కుంటుపడినట్టు స్పష్టమవుతున్నది. ఎగ్జిట్ పోల్స్, వివిధ సంస్థల సర్వేలు వేర్వేరు ఫలితాలను సూచించడమే ఇందుకు కారణం. మొత్తం మీద బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని, పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉంటుందో చెప్పలేమని విశే్లషకులు తేల్చిచెప్తున్నారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఒకవైపు, కాంగ్రెస్‌సహా విపక్షాలన్నీ ఒకవైపు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టిపోటీ తప్పదని సర్వే ఫలితాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజస్థాన్‌లో అధికార బీజేపీని ఓడించి కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి వసుంధరరాజే వ్యవహార శైలి, తీసుకున్న నిర్ణయాలు బీజేపీ ప్రతిష్టను మసకబార్చాయి. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ప్రస్తుత అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు దక్కుతుందా లేదా కాంగ్రెస్, తెలుగు దేశం, తెలంగాణ జన సమితి, వామపక్షాలతో కూడిన ప్రజా కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతున్నది. అంటే, అధికార రేసులో బీజేపీ కనుచూపు మేరలో కూడా లేదని స్పష్టమవుతున్నది. మొత్తం మీద చత్తీస్‌గఢ్‌ను మినహాయిస్తే, మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ వార్తల ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. లాభసాటిగా మొదలవుతుందని ఊహించిన మార్కెట్ అందుకు భిన్నంగా నష్టాలను మూటగట్టుకుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి కాబట్టి, ఈవారంలోని తర్వాతి రోజుల్లో స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అంశంపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతున్నది. బీఎస్‌ఈలో సోమవారం జరిగిన 30 షేర్ ట్రేడింగ్‌లో కోల్ ఇండియా, మారుతి మాత్రమే లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ, పవర్‌గ్రిడ్, హెడ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో తదితర కంపెనీల షేర్లు సుమారు నాలుగు శాతం మేరకు నష్టపోయాయి.