బిజినెస్

ఆర్‌బీఐ సలహాలు గౌరవించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 10: ఆర్థికపరమైన స్థిరత్వం కోసం రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇచ్చే సలహాలు, సూచనలను భారత ప్రభుత్వం తప్పక గౌరవించాలని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త మారిస్ ఆబ్‌స్టఫైడ్ సూచించారు. చాలా విషయాలపై కేం ద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి, కేం ద్ర బ్యాంకుకు మధ్య విభేదాలు వచ్చాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇక్కడ జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయపరమైన అంశాల కోసం కేంద్ర బ్యాంకులను తప్పుదో వ పట్టించడాన్ని ఐఎంఎఫ్ ఎన్నడూ కోరుకోదని, రాజకీయ కారణాలతో ఆర్‌బీఐని బలిపెట్టొద్దన్నారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న అస్థిర పరిస్థితుల గురించి తాను వ్యాఖ్యానించబోనని, ఆర్థిక స్థిర త్వం కోసం చెల్లింపుల విధానంలో రిజర్వ్‌బ్యాంకు పాత్ర కచ్చితంగా ఉండాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ విషయంలో ఆర్థిక అస్థిరత ఏర్పడకుండా రిజర్వ్‌బ్యాంకు, భారత్ ప్రభుత్వం ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చి ఉంటాయనుకుంటున్నానన్నారు. దేశంలో ఆర్థిక స్థిరత్వానికి ఎలాం టి భంగం కలుగరాదని ఆర్‌బిఐ భావించడాన్ని తాను సమర్థిస్తానని, భారత ప్రభుత్వం కూడా దాని కి సహకరించి ఆ విషయంలో ఆర్‌బీఐ సలహాలు, సూచనలు పాటించాలని ఆయన చెప్పారు. ఇటీవల ఆర్‌బిఐ బోర్డు జరిపిన సమావేశంలో ఆర్‌బిఐకి కావాల్సిన మూలధనం ఎంత?, చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలిచ్చే విషయంలో పాటించాల్సిన నిబంధనలు, బలహీనంగా ఉన్న బ్యాంకుల పు నరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశా లు చర్చకు వచ్చాయన్నారు. అమెరికా, భారత్, అ ర్జెంటీనా, టర్కీ తదితర దేశాల్లోని కేంద్ర బ్యాంకుల స్వతంత్రతకు ఆటంకం కలుగుతోందన్న ప్రశ్నకు ఆర్థిక నియంత్రణ సంస్థగా కేంద్రబ్యాంకుల పాత్ర చాలా క్లిష్టమైనదని అన్నారు. వాస్తవానికి మనం ఊ హించిన దానికన్నా కేంద్ర బ్యాంకులకు విశేష అధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ద్రవ్య విధానాలలో ఆర్థికపరమైన స్థిరత్వం కోసం రిజర్వ్‌బ్యాం కు ప్రాథమికంగా ప్రధాన పాత్రపోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగిత పెరగడం, ఆర్థికపరమైన నష్టాల నుంచి ఆయా దేశాలు గట్టెక్కడం మనం చూశామని, అదే సమయంలో అవి తీసుకున్న నిర్ణయాల్లోని పారదర్శకత, జవాబుదారీతనంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. అయితే వాటి చర్యలపై ప్రజలు ప్రశ్నించడం మంచి పరిణామమేనని, దాంతో అవి మరింత పారదర్శకంగా పనిచేసి తాము తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరించే బాధ్యత పెరుగుతుందని అన్నారు. అయితే ఇదే సమయంలో రాజకీయ కారణాలతో కేంద్ర బ్యాం కును ఆయా పార్టీలు తప్పుదోవ పట్టించడాన్ని తాము ఎంతమాత్రం సమర్థించమని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామినస్టు మారిస్ స్పష్టం చేశారు.