బిజినెస్

పారిశ్రామిక దిగ్గజాలు స్ఫూర్తిదాతలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాం: పారిశ్రామిక దిగ్గజాలు స్ఫూర్తిదాతలు కావాలని టాటాట్రస్టు చైర్మన్, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పిలుపునిచ్చారు. సోమవారం రాజాంలోని జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మనం పుట్టిన దేశం కోసం ఏమైనా చేయాలి, ఏదైనా ఇవ్వాలి అనే విధానంతో నడుచుకుంటే మరికొంత మందికి స్ఫూర్తిగా నిలుస్తామన్నారు. ఇలా చేయగలిగితే జీవితానికి ఒక సార్థకత చేకూరుతుందన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి జీఎంఆర్ అని, వరలక్ష్మీ ఫౌండేషన్ ద్వారా కులం, మతం, వర్గ భేదాలు చూడకుండా అందరినీ సమానంగా చూస్తూ విద్య, ఆరోగ్యం, కనీస సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టి తమలాంటి వారికి కూడా కొత్త ఉత్సాహం కలిగిస్తున్నారన్నారు.
ఇటువంటి కార్యక్రమాలు తన హృదయంలో పదిలపర్చుకుంటానని, ఒకరి కోసం ఒకరు, పది మంది కోసం పది మంది బతికే సమాజం కావాలన్నారు. సంతోషం, మానవత్వం, అంకితభావం వంటి అంశాలు ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ తన ఏళ్ల ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడి ఉన్న రాజాం విద్య, ఆరోగ్యం, కనీస సౌకర్యాల కల్పనలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ స్థాపన జరిగిందని, ఈ ఫౌండేషన్ పేదవారికి ఆసరాగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గ్రంథి ఈశ్వరరావు, చిన వెంకటరాజు, ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

చిత్రం..ఫౌండేషన్ పైలాన్ ప్రారంభం అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతున్న
టాటా గ్రూప్ చైర్మన్, పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా