బిజినెస్

ఐఐఎంలో సీఏలకు మేనేజ్‌మెంట్‌లో శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: చార్టెర్డ్ అకౌంటెంట్లకు మేనేజిమెంట్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌తో చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎఐ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు పరస్పరం మేనేజిమెంట్, అకౌంటింగ్ రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించాయి. మేనేజిమెంట్ ఎడ్యుకేషన్ రంగంలో ఐసీఎఐ ఆధ్వర్యంలో సీఏలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఐఐఎం ఖరారు చేస్తుంది. ఈ వివరాలను ఐసీఎఐ అధ్యక్షుడు ఎన్‌డీ గుప్తా చెప్పారు. బిజినెస్ ప్రాక్టీసస్, టెక్నాలజీ రంగంలో సీఏలకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఈ ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు చార్టెర్డ్ అకౌంటెంట్లకు ఐఐఎం అహ్మదాబాద్‌లో శిక్షణ ఇస్తారు.