బిజినెస్

మాల్యను వీలైనంత త్వరలో తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్ బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగవేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యను వీలైనంత త్వరలో భారత్‌కు తెచ్చేందుకు చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మాల్యను భారత్‌కు అప్పగించాలని లండన్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మాల్యా దాదాపు 13 బ్యాంకులకు బకాయి ఉన్నాడు. ఈ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి లండన్‌కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి. దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగగొట్టి దేశం వదిలిపెట్టి వెళ్లేవారికి లండన్ కోర్టు చెంపపెట్టు లాంటినవని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. మాల్యను భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత ఎగవేతదార్ల విషయంలో బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేసినట్లవుతుందన్నారు. విజయ్ మాల్య 2016లో భారత్‌ను లండన్‌కు పరారైన విషయం విదితమే. ఇటీవల మాల్య ట్వీట్ చేస్తూ బకాయిలను చెల్లిస్తానని, అసలును చెల్లిస్తామని పేర్కొన్న విషయం విదితమే. వంద శాతం బకాయిలను చెల్లిస్తానని ఆయన చెప్పారు. కాగా విజయ్ మాల్య నుంచి బకాయిలు పూర్తిగా చెల్లించే విషయమై ఎటువంటి వర్తమానం అందలేదని ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. అన్ని బ్యాంకులను కలిపి కన్సార్టియంను ఎస్‌బీఐ ఏర్పాటు చేసిందన్నారు. మాల్యను తీసుకువచ్చిన తర్వాత పరారీలో ఉన్న నీరవ్‌మోడీ, మెహల్ చౌక్సీలను కూడా భారత్‌కు తెస్తామన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.