బిజినెస్

నూతన ఆవిష్కరణల్లో ఏపీతో భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 11: నూతన ఆవిష్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి అమెరికాలోని కాలిఫోర్నియా లెజిస్లేటివ్ ప్రతినిధులు సుముఖత వ్యక్తంచేశారు. ఇందులో భాగంగా మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కాలిఫోర్నియా సెనేట్ సభ్యుడు అష్‌కల్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సిసిలియా ఆగ్యా, రిచర్డ్ బ్లూం, ఎలిస్ గొమెజ్ రెయిస్, షాలోన్ క్విర్క్ శిల్వా, మార్క్‌స్టర్ భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చేపడుతున్న సంస్కరణలు, అమలుచేస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఢిల్లీ, హైదరాబాద్‌ను సందర్శించిన అనంతరం అమరావతి చేరుకున్న ప్రతినిధి బృందానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. జలవనరుల నిర్వహణ, సాంకేతిక వినియోగం, ఈ గవర్నెన్స్, రియల్‌టైం మానిటరింగ్ వ్యవస్థల గురించి ఆసక్తికరంగా తెలుసుకున్నారు. నిత్య నూతన ఆవిష్కరణలలో కాలిఫోర్నియా ముందంజలో ఉందని, భారతదేశం సైతం అదే విధానాలను అనుసరిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే తన ఆకాంక్షగా చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా ప్రజల్లో 76 శాతం సంతృప్తి వ్యక్తమవుతోందని వివరించారు. ఈజ్ ఆఫ్ లివింగ్‌తో ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన జీవన ప్రమాణాలను కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు వివిధ రంగాల్లో దేశం మొత్తంగా ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని, తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ వ్యవసాయరంగంలో వృద్ధిరేటు సాధించ గలిగామన్నారు. వర్షపునీటి నిల్వ, నదుల అనుసంధానం, సౌర విద్యుత్ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రతినిధులకు వివరించారు. స్పందించిన కాలిఫోర్నియా ప్రతినిధి బృందం నూతన ఆలోచనలు, సాంకేతిక వినియోగంతో ఏపీతో భాగస్వామ్యం వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రతినిధి బృందంలో మల్లిక్ ఆర్ మేదరమెట్ల తదితరులు ఉన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమైన కాలిఫోర్నియా ప్రజాప్రతినిధులు