బిజినెస్

ఆశాజనకంగా ‘నెఫ్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా పేపర్ కరెన్సీని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా జరుగుతున్న చెల్లింపులు, వసూళ్లు ఆశాజనకంగా సాగుతున్నాయి. నగదు లభ్యత తగ్గడంతోపాటు, దాదాపు అన్ని బ్యాంకులూ ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించడంతో నెఫ్ట్ ద్వారా చెల్లింపులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి మాసంలో అత్యధికంగా 22,540.77 కోట్ల రూపాయల మేర లావాదేవలు జరిగాయి. అయితే, ఆ మరుసటి నెల, ఏప్రిల్‌లో నెఫ్ట్ ద్వారా చెల్లింపుల విలువ 16,326.64 కోట్ల రూపాయలకు పడిపోయింది. కానీ, ఆతర్వాత పరిస్థితి క్రమంగా మెరుగవుతూ వస్తున్నది. మే మాసంలో 17,152, జూన్‌లో 19,017.08, జూలైలో 17,321.40, ఆగస్టులో 18,712.40, సెప్టెంబర్‌లో 18,015.50 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు నెఫ్ట్ ద్వారా జరిగాయి. అక్టోబర్ మాసంలో ఇది 19,227.03 కోట్ల రూపాయలకు పెరిగింది. నెఫ్ట్ ద్వారా వసూళ్లు, చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలు జోరందుకోవడం పట్ల ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.